B 21 Raider: అమెరికా చేతిలో అత్యాధునిక రహస్య విమానం.. తయారీ ఖర్చు ఎంతో తెలిస్తే..
ABN, First Publish Date - 2022-11-30T21:20:00+05:30
అగ్రరాజ్యం అమెరికా (America) మిలిటరీ అమ్ములపొదిలో మరో అత్యాధునిక విమానం చేరింది. బీ-21 రైడర్‌గా (B-21 Raider) పేరు పెట్టిన ఈ రహస్య మిలిటరీ విమానాన్ని ఈ శుక్రవారమే ఆవిష్కరించనున్నారు.
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా (America) మిలిటరీ అమ్ములపొదిలో మరో అత్యాధునిక విమానం చేరింది. బీ-21 రైడర్‌గా (B-21 Raider) పేరు పెట్టిన ఈ రహస్య మిలిటరీ విమానాన్ని ఈ శుక్రవారమే ఆవిష్కరించనున్నారు. ఇప్పటివరకు రూపొందించిన మిలిటరీ విమానాల్లో ఇదే అత్యంత అధునాతనమైనదని దీనిని తయారు చేసిన ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీ నార్త్‌రోప్ గ్రుమ్మాన్ (Northrop Grumman) తెలిపింది. బీ-1, బీ-2 విమానాల స్థానంలో దీనిని ప్రవేశపెట్టనున్నట్టు వివరించింది.
లాంగ్ రేంజ్, న్యూక్లియర్ మిషన్స్‌ను నిర్వహించేందుకు ఈ విమానాన్ని డిజైన్ చేశారు. ఒక్కో విమానం తయారీకి 2 బిలియన్ డాలర్లు (సుమారు రూ.16 వేల కోట్లు) ఖర్చవుతుందని అంచనా. 2023 తొలినాళ్లలో ఈ విమానాల కార్యకలాపాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రహస్య సాంకేతికత, అధునాతన నెట్‌వర్కింగ్ సామర్థ్యాలు, ఓపెన్ సిస్టమ్ ఆర్కిటెక్చర్‌తో రూపొందించినట్టు నార్త్‌రోప్ వెబ్‌సైట్ పేర్కొంది. తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లోనూ బీ-21 విమానం పనితీరు అత్యుత్తమంగా ఉంటుందని వివరించింది. ఈ విమానాన్ని ‘డిజిటల్ బాంబర్’గా కంపెనీ అభివర్ణించింది. వేగవంతమైన, మరింత సౌకర్యవంతమైన కమ్యూనికేషన్ కోసం చురుకైన టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్‌తో తయారు చేసినట్టు వెల్లడించింది. ఆరు రైడర్స్ తయారీ అమరిక, పరీక్ష వంటి వేర్వేరు దశల్లో ఉన్నాయని తెలిపింది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో నిర్వహించిన మిషన్ ‘డూలిటిల్ రైడ్’కి గౌరవ సూచకంగా విమానానికి బీ-2 రైడర్ పేరు పెట్టారు. ఈ మిషన్‌కి చాలా ప్రాధాన్యత ఉందని కంపెనీ పేర్కొంది. నార్త్‌రోప్ గ్రుమ్మాన్ కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం.. కాలిఫోర్నియాలోని పల్మ్‌డేల్ ఫెసిలిటీలో ఆరు బీ-21 బాంబర్స్‌ను తయారు చేస్తున్నారు. 2015లో ఈ విమానాల తయారీ ఒప్పందాన్ని కంపెనీకి అప్పగించారు.
Updated Date - 2022-11-30T21:20:58+05:30 IST