Pathaan: షారూఖ్ ఖాన్ ఆ సినిమాను కుమార్తెతో కలిసి చూడాలి: మధ్యప్రదేశ్ స్పీకర్ సవాల్

ABN, First Publish Date - 2022-12-19T16:05:41+05:30

త్వరలోనే విడుదల కాబోతున్న షారూక్ ఖాన్( Shah Rukh Khan) సినిమా ‘పఠాన్’(Pathaan)పై దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలు చల్లారడం లేదు. ఆ సినిమాలోని ‘బేషరమ్ రంగ్’ పాట దేశవ్యాప్తంగా కలకలం రేపింది

Pathaan: షారూఖ్ ఖాన్ ఆ సినిమాను కుమార్తెతో కలిసి చూడాలి: మధ్యప్రదేశ్ స్పీకర్ సవాల్
Pathaan
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Bhopal: త్వరలోనే విడుదల కాబోతున్న షారూక్ ఖాన్( Shah Rukh Khan) సినిమా ‘పఠాన్’(Pathaan)పై దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలు చల్లారడం లేదు. ఆ సినిమాలోని ‘బేషరమ్ రంగ్’ పాట దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఆ పాటలో నటి దీపికా పదుకునే ధరించిన కాస్ట్యూమ్స్ మరీ అసభ్యకరంగా ఉన్నాయంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా ఉద్యమమే నడుస్తోంది. పలువురు రాజకీయ నాయకులు సైతం ఈ సినిమాకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా (Narottam Mishra) కూడా ఈ సినిమాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాజాగా, ఈ జాబితాలో ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గిరీశ్ గౌతమ్ కూడా చేరారు.

షారూక్ ఖాన్ ఆ సినిమాను తన కుమార్తెతో కలిసి చూసి ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి, ‘పఠాన్’ సినిమాను తాను తన కుమార్తెతో కలిసి చూసినట్టు ఈ ప్రపంచానికి చెప్పాలని సవాలు చేశారు. ఇది ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదన్న స్పీకర్.. మీకేమనిపిస్తే అది చేసేస్తారా? అని ప్రశ్నించారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరిట ఇలాంటి ఒక సినిమాను మహమ్మద్ ప్రవక్తపై తీసి విడుదల చేస్తే ప్రపంచవ్యాప్తంగా రక్తపాతం జరుగుతుందని పేర్కొన్నారు.

మధ్యప్రదేశ్‌లో నేటి నుంచి ఐదు రోజులపాటు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ‘పఠాన్’ సినిమాను నిషేధించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్న వేళ అసెంబ్లీలో ఈ అంశంపై చర్చ జరిగే అవకాశం ఉంది. కాగా, డాక్టర్ గోవింద్ సింగ్ వంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా పఠాన్ సినిమాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ సినిమా విలువలకు వ్యతిరేకంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-12-19T16:40:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising