ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rajnath Singh: సూపర్‌పవర్‌‌గా ఇండియా

ABN, First Publish Date - 2022-12-17T11:53:52+05:30

ప్రపంచ సంక్షేమానికి పాటుపడే సూపర్‌పవర్‌గా నిలవాలని భారతదేశం కోరుకుంటోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. శనివారంనాడిక్కడ జరిగిన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రపంచ సంక్షేమానికి పాటుపడే సూపర్‌పవర్‌గా నిలవాలని భారతదేశం కోరుకుంటోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. శనివారంనాడిక్కడ జరిగిన 95వ ఎఫ్ఐసీసీఐ (FICCI) వార్షిక సదస్సులో రాజ్‌నాథ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో దేశానికి ఐదు వాగ్దానాలు చేశారని గుర్తుచేశారు. ఈ ఐదు వాగ్దానాలూ దేశాన్ని సూపర్‌పవర్‌గా తీర్చిద్దేందుకు అనివార్యమని అన్నారు. ఇండియా సూపర్‌పవర్‌ కావడం అంటే ఏ ఒక్క దేశంపైనో ఆధిపత్యం కోసం కాదని, ఇతర దేశాలకు చెందిన ఒక్క అంగుళం భూమిని కూడా ఆక్రమించుకునే ఉద్దేశం మనకు (భారతదేశానికి) లేదని చెప్పారు. భారత రక్షణ బలగాల ధైర్యసాహసాలు ప్రశంసంస్తూ..''గల్వాన్ కావచ్చు, తవాంగ్ కావచ్చు, మన రక్షణ బలగాలు అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శించాయి'' అని అన్నారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో 5వ స్థానంలో ఉన్నాం..

భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కంటే చైనా జీడీపీ 1949లో చాలా తక్కువగా ఉండేదని, 1980 వరకూ భారతదేశం కనీసం టాప్-10 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కూడా లేదని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. 2014లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం 5వ స్థానంలో ఉందన్నారు. ఈరోజు 3.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలోనే ఐదవ స్థానానికి చేరుకుందని తెలిపారు.

Updated Date - 2022-12-17T11:55:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising