ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Aviation Ministry : విమానాల్లో ఫేస్ మాస్క్‌లపై సరికొత్త ఆదేశాలు

ABN, First Publish Date - 2022-11-16T20:30:51+05:30

కోవిడ్-19 మహమ్మారి (Covid-19 Pandemic) నిరోధం కోసం ఉపయోగించిన మాస్క్‌లను విమాన ప్రయాణాల్లో

Face Mask
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి (Covid-19 Pandemic) నిరోధం కోసం ఉపయోగించిన మాస్క్‌లను విమాన ప్రయాణాల్లో ఇకపై వాడవలసిన అవసరం లేదని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (civil aviation ministry) బుధవారం ప్రకటించింది. అయితే కరోనా వైరస్ ముప్పు దృష్ట్యా ప్రయాణికులు ఫేస్ మాస్క్‌ (face masks)లను వాడటం శ్రేయస్కరమని తెలిపింది.

ఈ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో, కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖను సంప్రదించి, విమానాల్లో ప్రయాణించేటపుడు ప్రయాణికులు ఫేస్ మాస్క్‌లు, ఫేస్ కవర్ల వాడటంపై సమీక్షించినట్లు తెలిపింది. ప్రయాణికులను ఉద్దేశించి విమానాల్లో చేసే ప్రకటనల్లో ఫేస్ మాస్క్ వాడకపోతే జరిమానా విధిస్తారని, దండన చర్యలు తీసుకుంటారని ప్రస్తావించవద్దని ఆదేశించింది. కరోనా వైరస్ ముప్పు దృష్ట్యా ఫేస్ మాస్క్/ఫేస్ కవర్ వాడటం శ్రేయస్కరమని మాత్రమే చెప్పాలని తెలిపింది.

Updated Date - 2022-11-16T20:30:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising