ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Anu emmanuel Interview: డేటింగ్‌ విషయం అరవింద్‌గారు అడిగారు!

ABN, First Publish Date - 2022-11-03T20:48:26+05:30

నాకు భయం లేదు.. తప్పు చేసినవాళ్లే భయపడతారు.. తప్పు చేస్తేనే అబద్ధం చెబుతారు.. నేను దేనికీ, ఎవరికీ భయపడను.. ఆ అవసరం కూడా నాకు లేదు.. మలయాళ బ్యూటీ అను ఇమ్మాన్యూయేల్‌ తన గురించి చెప్పుకొచ్చిన విషయాలివి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాకు భయం లేదు.. (Anu emmanuel)

తప్పు చేసినవాళ్లే భయపడతారు..

తప్పు చేస్తేనే అబద్ధం చెబుతారు..

నేను దేనికీ, ఎవరికీ భయపడను..

ఆ అవసరం కూడా నాకు లేదు..

మలయాళ బ్యూటీ అను ఇమ్మాన్యూయేల్‌ తన గురించి చెప్పుకొచ్చిన విషయాలివి. ‘డిఫైన్‌ అనూ’ అని అడిగితే.. ‘నన్ను ఎలా డిఫైన్‌ చేయాలో తెలీదు. కానీ అనూ అంటే కాంప్లెక్స్‌ ప్రైవేట్‌, సిన్సియర్‌ గర్ల్‌ అని చెప్పగలను అని సమాధానమిచ్చారు. ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘ఊర్వశివో.. రాక్షసివో’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా అను ఇమ్మాన్యుయేల్‌ ‘చిత్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ విషయాలు ఆమె మాటల్లో...(Chitchat with Anu emmanuel)

నేను పుట్టి పెరిగింది అంతా అమెరికాలోనే! సినిమా ఇండస్ట్రీకి ఏ సంబంధం లేని కుటుంబం నాది. ఆరేళ్ల క్రితం నేను హీరోయిన్‌గా కెరీర్‌ ప్రారంభించా. జీవితంలో దేనిని మనం అంచనా వేయలేం. అలాగే ఊహించని విధంగా నేను సినిమాల్లోకి వచ్చాను. హీరోయిన్‌గా ‘మజ్ను’ నాకు మంచి లాంచ్‌. ఆ సినిమా బాగా ఆడింది. ఆ తర్వాత ‘కిట్టూ ఉన్నాడు జాగ్రత్త’ కూడా బాగానే ఆడింది. పవన్‌కల్యాణ్‌గారి సరసన నటించే అవకాశం వచ్చింది. అంత పెద్ద అవకాశం వస్తుందని ఊహించలేదు. పవన్‌ కల్యాణ్‌ –త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ అంటే అంచనాలుంటాయి. ఆ సినిమా పెద్ద హిట్‌ అవుతుందనుకున్నా. కానీ రిజల్ట్‌ వేరేలా వచ్చింది. అయినా నా నటన ఫెయిల్‌ కాలేదు. తదుపరి బన్నీతో ‘నా పేరు సూర్య’ సినిమా చేశా. ఈ సినిమాకూ చాలా ఎక్స్‌పెక్ట్‌ చేశా. అది కూడా ఆడలేదు. కెరీర్‌ బిగినింగ్‌లో చేసిన ప్రతి సినిమా మీద ఆశలు పెట్టుకునేదాన్ని. ఇప్పుడు ఏ సినిమాకు నేను ఏదీ ఎక్స్‌పెక్ట్‌ చేయడం లేదు. 

ప్రతీది నా నిర్ణయమే! 

అమెరికా నుంచి డైరెక్ట్‌ సినిమాల్లోకి రావడంతో మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డా. ఇక్కడ లాంగ్వేజ్‌ తెలీదు. యాక్టింగ్‌ అంటే ఏంటో తెలీదు. యాక్టింగ్‌ స్కూల్‌కి వెళ్లిందీ లేదు. నాకు గైడ్‌ చేసేవారు లేకపోవడం కొన్ని విషయాల్లో మైనస్‌ అనుకుంటున్నా. అసలు కెమెరాను ఎలా ఫేస్‌ చేయాలో కూడా తెలియదు నాకు. జీవితంలో నేను వేసిన ప్రతి స్టెప్‌లోనూ నా నిర్ణయంతోనే వెళ్లా. అయినా హీరోయిన్‌గా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో 13 సినిమాలు చేశా. నాలో టాలెంట్‌ లేకపోతే ఆరేళ్ల జర్నీ, 13 సినిమాలు ఉండేవి కాదు కదా! ఇప్పుడు కొంత అవగాహన వచ్చింది. మంచి కథలు ఎంచుకుంటున్నా. పాత్రకు న్యాయం చేస్తున్నా. ఫ్లోను ఫాలో అవుతున్నా. సినిమా వెంటనే సినిమా చేసేయాలని నాకు లేదు. మంచి అవకాశం కోసం ఎదురుచూస్తా. అవకాశం రాకపోతే.. ఇంట్లో కూర్చుంటా. దేనికీ కంగారుపడను. హీరోయిన్‌గా నేను నటించిన సినిమాలు ఫెయిల్‌ అయ్యాయేమో గానీ నా నటన ఎక్కడా ఫెయిల్‌ కాలేదు. ఇది నేను చెబుతున్న మాట కాదు. రివ్యూలు చెప్పాయి.. చాలా మెసేజ్‌లు వచ్చాయి. అనూ కళ్లతో అభినయించగలదు అనే గుర్తింపు తెచ్చుకున్నా. కొన్ని సినిమాల రిజల్ట్‌ చూశాక నన్ను నేను మార్చుకున్నా. రెగ్యులర్‌ సినిమాలకు దూరంగా ఉంటున్నా. వచ్చిన అవకాశంలో ఆ పాత్రకు నేను సూట్‌ అవుతాను అనుకుంటేనే ఓకే చేస్తున్నా.  ఏదో వచ్చాం... చేశాం.. వెళ్లాం అనుకునే పద్దతిలో లేను. మంచి కథ ఎంచుకోవడం, పాత్రకు న్యాయం చేయడం వరకే నా చేతిలో ఉంది. అంతకు మించి ఏదీ నా చేతిలో ఉండదు. దర్శకుడు చెప్పింది చేస్తాం.. ఇచ్చిన డైలాగ్‌ చెబుతామంతే. సక్సెస్‌ నా చేతిలో లేదు. నేను అంగీకరించిన ప్రతి పాత్రకు బెస్ట్‌ ఇవ్వాలి... ఇంకా ఇంప్రూవ్‌ కావాలనే తపన పడుతుంటా. సినిమా సినిమాకూ ఇంప్రూవ్‌ అవుతున్నా.  


డేటింగ్‌ విషయం ఆయనే అడిగారు...(Anu emmanuel about Dating)

నేనూ, అల్లు శిరీష్‌ డేటింగ్‌లో ఉన్నామనే గాసిప్పులు నా చెవిన పడ్డాయి. అయితే ఇవన్నీ నేను చదివినవి కాదు. అమ్మ న్యూస్‌ బాగా ఫాలో అవుతుంది. ఆమె అవన్నీ చదివి బాధపడింది. నేను ఇలాంటివి అసలు పట్టించుకోను. అమ్మ బాధపడుతుంటే నాకు కూడా బాధ కలుగుతుంది. అయితే ఓ విషయం చెప్పాలి. ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాకు ముందు అల్లు శిరీష్‌ని కలిసింది లేదు. పూజ రోజున కలవడమే మొదటిసారి. డైరెక్టర్‌ కథ మొత్తం నెరేట్‌ చేశాక నేను, శిరీష్‌ కాఫీ షాప్‌లో కూర్చుని క్యారెక్టర్స్‌ గురించి మాట్లాడుకున్నాం. ఒకరి తత్వం గురించి ఒకరు తెలుసుకున్నాం. శ్రీ, సింధూ పాత్రల్లో రియలిస్టిక్‌గా కనిపించడానికి కష్టపడ్డాం. మా ఇద్దరి మధ్య స్నేహ ఉంది కానీ డేటింగ్‌ చేసే చనువు, అంత ఎఫెక్షన్‌ లేదు. అయినా ఈ రోజుల్లో ఓ అమ్మాయి, అబ్బాయి కలిసి బయట టీ తాగితేనే రకరకాల రూమర్స్‌ పుట్టుకొస్తున్నాయి. ఒక లవ్‌స్టోరీలో కలిసి యాక్ట్‌ చేసినప్పుడు ఇలాంటి రూమర్స్‌ కామన్‌. నేను ఇలాంటివి పట్టించుకోను. బన్నీతో ‘నా పేరు సూర్య’ సినిమా చేసినప్పటి నుంచీ అరవింద్‌గారి కుటుంబ సభ్యులతో మంచి అనుబంధం ఉంది. శిరీష్‌తో డేటింగ్‌ అన్న విషయం గురించి అరవింద్‌గారు కూడా నన్ను అడిగారు. ఆ గాసిప్‌కి ఇద్దరం నవ్వుకున్నాం. 

అందరిలాంటి అమ్మాయిని కాదు...

నాది పార్టీ కల్చర్‌ కాదు. షూటింగ్‌ ఉంటే సెట్‌లో ఉంటా.. లేదంటే ఇంట్లో కూర్చుంటా. అప్పుడప్పుడూ కాఫీ షాప్‌కి వెళ్తానంతే. అంతకుమించి నాకు బయట పనేమీ ఉండదు. ఇక సోషల్‌ మీడియాకు వస్తే.. నేను అంత యాక్టివ్‌ కాదు. ఏదో రెస్టారెంట్‌కి వెళ్లి తిన్నామనీ, జిమ్‌లో కసరత్తులు చేశామని, ఎవరితోనో సెల్ఫీలు తీసుకున్నామని వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయను. ఫాలోయర్లు, లైక్స్‌ గురించి నేను పట్టించుకోను. నేను అందరిలాంటి అమ్మాయిని కాదు. కాస్త డిఫరెంట్‌. చాలా రిజర్వ్‌డ్‌గా ఉంటా. మరో హీరోయిన్‌తో నేను పోలిక పెట్టుకోను. నా స్టైల్‌ నాది అంతే! సోషల్‌ మీడియాను ఎంత వాడాలో అంతే వాడతాను. 

అరవింద్‌గారు కారణం...

ఇక ఈ సినిమా విషయానికొస్తే.. కథ ఎంపిక చేసుకోవడానికి చాలా కారణాలున్నాయి. మొదట బన్నీవాస్‌ ఈ కథతో నా దగ్గరకు వచ్చారు. సబ్జెక్ట్‌ విన్నాక చేయాలా? వద్దా అనే సందిగ్థంలో ఉన్నా. చాలా మీటింగ్‌ల తర్వాత ఓ రోజు అ?న్లి అరవింద్‌గారిని కలిశాను. ‘ఇలాంటి హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ క్యారెక్టర్‌ చేేస్త బావుంటుంది. డిఫరెంట్‌గా ట్రై చేయ్‌’ అన్నారు. నేను ఇంటికి వెళ్లి ఆలోచనలో పడ్డా. ఫైనల్‌గా కథ, సింధూ పాత్ర, అరవింద్‌గారి మాటలు నన్ను కన్విన్స్‌ చేశాయి. జనరల్‌గా ఓ సినిమా నా దగ్గరకు వచ్చిందీ అంటే హీరో ఎవరు, ఇతర ఆర్టిస్ట్‌లు ఎవరు? అని అడుగుతా. కానీ గత రెండు, మూడేళ్లలో సినిమా రంగంలో చాలా మార్పులొచ్చాయి. చూశాం. ప్రేక్షకులకి హీరో ఎవరనేది కూడా అక్కర్లేదు. కంటెంట్‌ ఎలా ఉందనేది చూస్తున్నారు. కంటెంట్‌ బావుందా లేదా అన్నదే చూస్తున్నారు. నా గత చిత్రాల్లాగా కాకుండా ఇందులో ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌లో కనిపిస్తా. 

పోలికలు.. తేడాలు..

నిజజీవితంలో అనూ ఇమ్మాన్యుయేల్‌ చాలా స్ర్టెయిట్‌ ఫార్వడ్‌ అమ్మాయి. కెరీర్‌లో వేేస ప్రతి అడుగు మంచి స్థాయికి తీసుకెళ్లాలనే ఆలోచన ఉంటుంది. సింధూ పాత్ర కూడా అలాగే ఉంటుంది. అది నాకు, సింధూ పాత్రకి ఉన్న పోలిక. ట్రైలర్‌లో చూపించిన ఫిజికల్‌ రిలేషన్‌షిప్‌ నిజజీవితంలో నాకు కనెక్ట్‌ కాదు. 

- ఆలపాటి మధు


Updated Date - 2022-11-03T20:48:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising