Srihaan - Inaya Sultana: హద్దు దాటకు.. ఎక్కడ పడుకున్నావో చూశా!
ABN, First Publish Date - 2022-11-03T18:26:43+05:30
బిగ్‌బాస్ సీజన్ 6(Biggboss6)లో ఇనయాకు లవ్ ట్రాక్స్ ఎలాగైతే ఉందో.. అంతే రేంజ్లో గొడవలూ ఉన్నాయి. శ్రీహాన్(Sri haan)కు, ఇనాయాకు (Inaya) మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత గొడవల్ని చూస్తూనే ఉన్నాం.
బిగ్‌బాస్ సీజన్ 6(Biggboss6)లో ఇనయాకు లవ్ ట్రాక్స్ ఎలాగైతే ఉందో.. అంతే రేంజ్లో గొడవలూ ఉన్నాయి. శ్రీహాన్(Sri haan)కు, ఇనాయాకు (Inaya) మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత గొడవల్ని చూస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకూ జరిగిన ఎనిమిది వారాల్లో ఏడు వారాలు ఇద్దరూ గొడవ పడుతూనే ఉన్నారు. గతవారం ఒకటే కాస్త స్నేహంగా కనిపించారు. తాజా ఎపిసోడ్ చూస్తే... షరా మామూలే అన్నట్లు తయారైంది. ఈ ఇద్దరి మధ్య గొడవ ఇప్పట్లో ముగిసేలా లేదు. మిషన్ పాజిబుల్ టాస్క్‌లో భాగంగా ఇతర స్క్వాడ్‌లోని సభ్యులను చంపేందుకు క్యాప్చర్ ద వార్ అనే ఛాలెంజ్ ఇచ్చారు బిగ్‌బాస్. ఈ టాస్క్‌లో శ్రీహాన్, రేవంత్, ఫైమా ఒకవైపు.. ఇనయ, వాసంతి, మెరీనా మరో టీమ్‌లో ఉన్నారు. టాస్క్ ప్రారంభంలో శ్రీహాన్ ఇనయను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడు. నామినేషన్లో తప్ప ఆమె దగ్గర కంటెంట్ ఏమీ ఉండదని..అలాంటి ఆమె మాట్లాడటమేంటని కౌంటర్ వేశాడు. దానికి ఇనయ ఫైర్ అయింది. ‘ఈ మధ్య నువ్వు కంటెంట్ బాగా ఇస్తున్నావ్లే, ఎక్కడ వెళ్లి పడుకుంటున్నావో చూస్తున్నా’ అని శ్రీహాన్‌ను ఉద్దేశించి అంది. ఆ మాటకు శ్రీహాన్‌కు మండింది. టాస్క్ పూర్తయ్యాక ఆమెతో గొడవకు దిగాడు. నోరు జారుతున్నావ్.. హద్దుల్లో ఉండూ.. నా క్యారెక్టర్ గురించి మాట్లాడతావా? అంటూ ఫైర్ అయ్యాడు. తమ రిలేషన్‌కు ఓ పేరు, లిమిట్ ఉందని, నీ నోరే పెంట అని అని శ్రీసత్యతో కలిసి శ్రీహాన్.. ఇనయపై మండిపడ్డారు. షో పీస్, డ్రామా క్వీన్, నోట్లో పెంట పెట్టుకుని మాట్లాడుతుందని ఎద్దేవ చేశాడు. దానికి కూడా ఇనాయ షాకింగ్ కామెంట్స్ చేసింది. శ్రీసత్య, శ్రీహాన్ కింద పడుకుని ఉండటం చూశానని చెప్పుకొచ్చింది. దీంతో వీరి మధ్య పెద్ద గొడవే జరిగింది. అయితే వీరిద్దరిపై ఇనాయా పెద్ద నిందే వేసింది. ఇప్పటి వరకూ జనం వీరిద్దరూ కలిసి ఉండటం చూశారు కానీ తప్పుగా మాత్రం అనుకోలేదు. వారిద్దరినీ ఫ్రెండ్స్‌గానే చూశారు. హద్దులు దాటిందీ లేదు. ఇనాయ వేసిన నిందకు రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
Updated Date - 2022-11-03T18:26:45+05:30 IST