ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tiruppavai: విజృంభించి లోకాన్ని కొలిచిన ఆ ఉత్తముడెవరు?

ABN, First Publish Date - 2022-12-17T18:27:57+05:30

ఐశ్వర్యం దేవతల కటాక్షానికి,‌ పాడి ఆవులు కటాక్షాన్నిచ్చే దేవతలకు, బరువైన పొదుగు‌ ఆరాధనకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధనుర్మాసం తిరుప్‌పావై మాసం. వసంతమాసంలో కోయిల నాదంలాగా ధనుర్మాసంలో ఆణ్డాళ్ తిరుప్‌పావై పల్లవిస్తుంది. ఆణ్డాళ్ శ్రీ కృష్ణుడి భక్తురాలు. మార్గశిరంలో‌ తెల్లవారుజామునే లేచి తలారా స్నానంచేసి నోము నోచుకుని కృష్ణుణ్ణి‌ ఆరాధించాలని గోపకన్యల్ని పిలవడం నుండీ తిరుప్‌పావై పాసురాలు మొదలౌతాయి. మనం ఈ పాసురాల్ని అవగతం చేసుకుంటూ వెళితే ఆణ్డాళ్ చెప్పేది మనకు హృదయంగమం ఔతుంది. రోజుకో పాసురమ్‌గా ధనుర్మాసం ముప్పైరోజులూ తిరుప్‌పావై మనతోనూ, మనలోనూ మెదులుతూ ఉంటుంది. ఇవాళ ధనుర్మాసం మూడోరోజు; తిరుప్‌పావై మూడో పాసురమ్ రోజు.

పాసురమ్  03 

మూడో పాసురమ్‌లో నోము కోసమని స్నానం చేస్తే ఏం జరుగుతుందో ఆణ్డాళ్ చెబుతోంది...

మూలం-

ఓఙ్గి ఉలగళన్ద ఉత్తమన్ పేర్పాడి

నాఙ్గళ్ నమ్‌పావైక్కు సాఱ్ట్రి నీరాడినాల్

తీఙ్గిన్ఱి నాడెల్లామ్ తిఙ్గళ్ ముమ్మారిపెయ్దు

ఓఙ్గు పెరుఞ్‌సెన్నెలూడు కయలుగళ

పూఙ్గువళైప్ పోదిల్ పొఱివణ్డు కణ్పడుప్పత్

తేఙ్గాగాదే పుక్కిరున్దు సీర్త ములైపఱ్ట్రి

వాఙ్గక్ కుడమ్ నిఱైక్కుమ్ వళ్ళఱ్ పెరుమ్ పసుక్కళ్

నీఙ్గాద సెల్వమ్ నిఱైన్దేలోరెమ్‌పావాయ్!

తెలుగులో-

విజృంభించి లోకాన్ని కొలిచిన  ఉత్తముడి నామగానం చేసి,

మనం నోము చేసుకోవాలనుకుని స్నానం చేస్తే

క్రమంతప్పకుండా దేశమంతా నెలకు మూడు వానలు కురుస్తాయి,

ఏపుగా ఎదిగిన ఎఱ్ఱని వరిచేను నీళ్లల్లో చేపలు తుళ్లుతూ ఉంటాయి,

విచ్చుకున్న కలువపూలపై తుమ్మెదలు కళ్లు వాల్చుకుని‌ ఉంటాయి,

ధైర్యంగా కాళ్ల దగ్గర కూర్చుని బరువైన పొదుగుల్ని పట్టుకుని

పితికితే కడవల్ని నింపుతాయి పెద్ద పెద్ద పాడి ఆవులు;

తొలగిపోని ఐశ్వర్యం నిండుగా ఉంటుంది; ఓలాల నా చెలీ!

అవగాహన-

ఈ పాసురమ్‌లో "విజృంభించి లోకాన్ని కొలిచిన ఉత్తముడు" అనడం విష్ణువు వామనావతారంలో వచ్చి విజృంభించి తన పాదంతో‌ లోకాన్ని ఆక్రమించడాన్ని సూచిస్తోంది.

"ఏపుగా ఎదిగిన ఎఱ్ఱని వరిచేను నీళ్లల్లో చేపలు తుళ్లుతూ ఉంటాయి" అనీ, "విచ్చుకున్న కలువపూలపై తుమ్మెదలు కళ్లు వాల్చుకుని‌ ఉంటాయి" అనీ చెబుతూ చక్కని గ్రామీణదృశ్యానికి చిక్కని పదచిత్రీకరణ చేసింది ఆణ్డాళ్.

ఐశ్వర్యం దేవతల కటాక్షానికి,‌ పాడి ఆవులు కటాక్షాన్నిచ్చే దేవతలకు, బరువైన పొదుగు‌ ఆరాధనకు, ధైర్యంగా కాళ్ల దగ్గఱ కూర్చోవడం ధైర్యం చేసి దేవత శరణుపొందడం వంటి విషయాలకు ప్రతీకలుగా అర్థమౌతున్నాయి. భక్తికి ముఖ్యంగా ఉండాల్సింది ధైర్యం. అందుకే ఆణ్డాళ్ ధైర్యంగా అన్న శబ్దాన్ని ప్రయోగించింది.

తిరుప్‌పావై పరిచయం, వివరణ కోసం ఈ లింక్‌పై క్లిక్ చెయ్యండి

ఆణ్డాళ్ తిరుప్‌పావై పాసురాల లింక్

రోచిష్మాన్

9444012279

Updated Date - 2022-12-18T23:18:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising