ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: అమెరికాలో భారతీయ టీనేజర్ ఆత్మహత్య..

ABN, First Publish Date - 2022-12-15T20:46:04+05:30

అమెరికాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన ఓ పదహారేళ్ల బాలుడు శాస్‌ఫ్రాన్‌సిస్కోలోని ప్రఖ్యాత గోల్డెన్ గేట్ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అమెరికాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన ఓ పదహారేళ్ల బాలుడు ఇటీవల శాస్‌ఫ్రాన్‌సిస్కోలోని ప్రఖ్యాత గోల్డెన్ గేట్ బ్రిడ్జిపై(Golden Gate Bridge) నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. బ్రిడ్జి వద్ద ఆ బాలుడి బ్యాగు, ఫోన్, సైకిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాలుడి ఆత్మహత్యాయత్నాన్ని గమనించిన పోలీసుల అక్కడికి చేరుకునేలోపే దారుణం జరిగినట్టు సమాచారం. కాగా.. భారత సంతతి వారు ఈ బ్రిడ్జిపైన ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం ఇది నాలుగోసారని స్థానిక ఎన్నారై నాయకుడు అజయ్ జైన్ మీడియాకు తెలిపారు.

1937లో నిర్మించిన గోల్డెన్ గేట్ బ్రిడ్జి.. ఓ ఇంజినీరింగ్ అద్భుతంగా ప్రఖ్యాతి గాంచింది. దురదృష్టవశాత్తూ ఈ వంతెన ఆత్మహత్యాయత్నాలకూ వేదికగా మారింది. గతేడాది 25 మంది ఈ వంతెనపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వంతెన అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకూ 2 వేల మంది ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నారు. కాగా.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు వంతెనకు ఇరువైపులా ఇనుప జాలీలు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 2018లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు ఈ ఏడాది కల్లా పూర్తవ్వాల్సి ఉన్నా పలు అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఫలితంగా.. నిర్మాణ ఖర్చులు 137.26 మిలియన్ డాలర్ల నుంచి 386.64 డాలర్లకు ఎగబాకాయి.

Updated Date - 2022-12-15T20:46:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising