ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

USA: అమెరికాలో దారుణం.. తల్లిని చూసేందుకు సెలవులపై ఇంటికి వెళితే..

ABN, First Publish Date - 2022-12-13T23:41:26+05:30

తల్లిని చూసేందుకు సెలవులపై ఇంటికి వెళ్లిన ఓ తనయుడికి ఊహించని షాక్ తగిలింది. నిర్జీవంగా పడి ఉన్న ఆమెను చూసి అతను నిశ్చేష్టుడయ్యాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: తల్లిని చూసేందుకు సెలవులపై ఇంటికి వెళ్లిన ఓ తనయుడికి ఊహించని షాక్ తగిలింది. నిర్జీవంగా పడి ఉన్న ఆమెను చూసి అతను నిశ్చేష్టుడయ్యాడు. జార్జియా రాష్ట్రంని అల్లాంటా నగరంలోని ఓ సబ్‌అర్బన్ ప్రాంతంలో శనివారం ఈ దారుణం జరిగింది. మృతురాలిని పోలీసులు ఎలినార్‌ బోవెల్స్‌గా గుర్తించారు. సాయంత్రం 5.30కు బోవెల్స్‌ తనయుడు జరిగిన దారుణాన్ని గుర్తించాడు. కారు దొంగతనం చేసేందుకు(Car Jacking) ఆమె ఇంటికొచ్చిన ఆంటోనియో బ్రౌన్ ఆమెను హత్య చేశాడు. సోమవారం పోలీసులు అతడిని హత్యా నేరం కింద అరెస్టు చేశారు. అయితే..గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఎలినార్ ఇంట్లోకి అతడు ఎలా ప్రవేశించాడో అన్నది ప్రస్తుతానికి మిస్టరీగా మారింది.

నిందితుడు ఎలీనార్ కారు దొంగతనం చేస్తు్న్న సమయంలోనే ఆమె గారేజ్‌లో వచ్చి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో నిందితుడు ఆమెను పలు మార్లు కత్తితో పొడిచి హత్య చేశాడని అనుమానిస్తున్నారు. నిందితుడి ఫొటోను అధికారులు బహిరంగ పరచడంతో కొందరు గుర్తుపట్టి అతడి ఆచూకీ గురించి పోలీసులకు తెలిపారు. దీంతో..బ్రౌన్ కటకటాలపాలయ్యాడు. కాగా.. ఎలీనార్ హత్య ఆ ప్రాంతా ప్రజలను కుదిపేసింది. కాగా.. తమ నగరంలో నేరాలకు పాల్పడే వారిని ఉపేక్షించబోమని నగర డిప్యూటీ పోలీస్ కమీషనర్ ఈ సందర్భంగా హెచ్చరిక చేశారు.

Updated Date - 2022-12-13T23:50:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising