ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: అది నా భర్త ఆత్మే.. ప్రేమగా బిడ్డ తల నిమురుతోంది.. మహిళ ఉదంతం వైరల్..

ABN, First Publish Date - 2022-12-17T21:00:59+05:30

ఇది నా భర్త ఆత్మ అంటూ ఓ అమెరికా మహిళ నెట్టింట షేర్ చేసిన వీడియో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఆత్మలు నిజంగా ఉన్నాయా..? అన్న ప్రశ్నకు ఎవరికి తోచిన సమాధానం వారు చెబుతారు. అయితే.. అమెరికా మహిళ తాజాగా టిక్‌టాక్‌లో(Tiktok) షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట మరోసారి ఆత్మల ఉనికి చర్చకు దారి తీసింది. అది నా భర్త ఆత్మే(Spirit) అంటూ ఆమె షేర్ చేసిన దృశ్యాలు కలకలం రేపుతున్నాయి. పెన్సిల్వేనియాకు(Pennsylvania) చెందిన విట్నీ ఆలేన్‌కు(Whitney Allen) ఇద్దరు పిల్లలు. ఏడాది క్రితమే రెండవ బిడ్డ జన్మించాడు. కాగా.. బిడ్డకు మూడు నెలల వయసున్నప్పుడు ఆమె భర్త చనిపోయాడు. తేనెటీగ కుట్టడంతో అలర్జెజీ బారిన పడ్డ అతడు చివరకు గుండెపోటుతో మరణించాడు.

అయితే.. ఇటీవల బిడ్డ రూంలో అమర్చిన ఓ కెమెరాలో సంచలన దృశ్యం రికార్డైంది. ఏదో తెలియని వెలుతరు బిడ్డ నుదురుపై అటూ ఇటూ కదులుతున్నట్టు వీడియోలో రికార్డైంది. ఆ వెలుతురు ఓ చేయి ఆకారంలో ఉన్నట్టు కనిపించింది. ఈ దృశ్యాన్ని ఆమె టిక్‌టాక్‌లో షేర్ చేయగానే విపరీతంగా వైరల్ అయిపోయింది. ‘‘నా భర్తే వచ్చి బిడ్డ తలనిమిరినట్టు నాకు ఆ దృశ్యం చూడగానే అనిపించింది’’ అని ఆమె కామెంట్ చేసింది. దీనికి నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. అది నీ భర్తే..సందేహం వద్దు అంటూ అనేక మంది రిప్లై ఇచ్చారు. వారిది ఆత్మసంబంధం అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. ‘‘నా భర్త తన ప్రాణాల్ని బిడ్డల కోసం త్యాగం చేసినట్టు నాకు అప్పుడు ఎందుకో అనిపించింది’’ అని అలెన్ కామెంట్ చేయడం పలువురిని కదిలించింది. అలెన్ భర్త ఈ ఏప్రిల్‌లో మరణించాడు.

Updated Date - 2022-12-17T21:10:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising