ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: గర్భవతినని నాకే తెలీదు.. ఏం చేయాలో తెలియకే బిడ్డను పారేశా.. అమెరికాలో ఓ భారతీయ యువతి మాటలివి..!

ABN, First Publish Date - 2022-12-17T16:29:33+05:30

‘‘గర్భవతినని నాకే తెలీదు.. ఏం చేయాలో తెలియకే బిడ్డను పారేశా..’’ అమెరికాలో ఓ భారతీయ యువతి మాటలివి. నాలుగేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనలో నిందితురాలు ఆర్యా సింగ్‌పై తాజాగా హత్యానేరం నమోదైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ‘‘గర్భవతినని నాకే తెలీదు.. ఏం చేయాలో తెలియకే బిడ్డను పారేశా..’’ అమెరికాలో ఓ భారతీయ యువతి(Indian Origin) మాటలివి. నాలుగేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనలో నిందితురాలు ఆర్యా సింగ్‌పై(Arya Singh,29) తాజాగా హత్యానేరం నమోదైంది. గురువారం ఫ్లోరిడా(Florida) పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తాను నేరం చేసినట్టు ఆర్యా అంగీకరించిందని తెలిపారు. బిడ్డను ఏం చేయాలో తెలీక ఆ చిన్నారిని సముద్రంలో పడేసిందని(Newborn thrown into Florida Creek) మీడియాకు చెప్పారు. ‘‘ఇది మనసును కలిచివేసే ఘటన. 2018 జూన్ 1న ఆ చిన్నారి ఫ్లోరిడా సముద్ర తీరంలో తేలియాడుతూ కనిపించింది. చెత్తను పారేసినట్టు ఆర్యా తన బిడ్డను వదిలించుకుంది.’’ అని పామ్ బీచ్ పోలీసు అధికారి రిక్ బ్రాడ్షా పత్రికా సమావేశంలో పేర్కొన్నారు.

నాలుగేళ్ల నాటి ఈ కేసు చాలా కాలం పాటు ఓ మిస్టరీగా మిగిలిపోయింది. ఇటీవల బిడ్డ బంధువుకు సంబంధించిన వివరాలు అమెరికా జాతీయ డీఎన్ఏ డాటాబేస్‌లో దర్శనమిచ్చాయి. ఈ క్లూ సాయంతో పోలీసులు బిడ్డ తండ్రి జాడ కనుక్కున్నారు. అతడి డీఎన్ఏ పరీక్షకు అంగీకరించడంతో పాటూ నాలుగేళ్ల క్రితం ఓ మహిళతో డేటింగ్ చేసిన విషయాన్ని కూడా వెల్లడించాడు. అప్పట్లో ఆర్యా తాను ప్రెగ్నెంట్ అన్న విషయంచెప్పినట్టు పోలీసులకు వివరించాడు. గర్భం సంగతి తాను చూసుకుంటానని ఆర్యా అనడంతో..ఆమె అబార్షన్ చేయించుకుంటుందని తాను భావించినట్టు చెప్పుకొచ్చాడు. మరోవైపు.. నిందితురాలిని పట్టుకునేందుకు అధికారులు రహ్య ఆపరేషన్‌కు తెరలేపారు. ఆర్యా బయట పారేసిన చెత్తను ఆమెకు అనుమానం రాకుండా సేకరించారు. ఆ శాంపిళ్లపై డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించి..బిడ్డ జన్యుక్రమంతో సరిపోల్చారు. ఫలితంగా.. ఆర్యా నేరం రుజువైంది. ‘‘బిడ్డను ఏం చేయాలో ఆమెకు పాలుపోలేదు. దీంతో.. సముద్రంలో పారేయాలని ఆమె నిర్ణయించుకుంది’’ అని ఈ కేసును దర్యాప్తు చేసిన డిటెక్టివ్ బ్రిట్టానీ క్రిస్టోఫెల్ తెలిపారు. అప్పట్లో ఆఫ్ డ్యూటీలో ఉన్న అగ్నిమాక సిబ్బంది ఒకరు బిడ్డను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అధికారులు పాపకు ‘జూన్’ అని నామకరణం చేశారు.

Updated Date - 2022-12-17T16:36:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising