ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Crash Landing: సముద్ర తీరంలో అత్యవసర ల్యాండింగ్.. బోల్తా పడ్డ విమానం..

ABN, First Publish Date - 2022-12-23T20:12:20+05:30

సముద్ర తీరంలో అత్యవసరంగా ల్యాండయ్యే క్రమంలో అమెరికాకు చెందిన ఓ సెస్నా 150 విమానం బోల్తా పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: సముద్ర తీరంలో అత్యవసరంగా ల్యాండయ్యే క్రమంలో(Crash Landing) అమెరికాకు చెందిన ఓ సెస్నా 150(Cessna 150) విమానం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విమానంలోని ఇద్దరు ప్రయాణికులు గాయాలపాలయ్యారు. లాస్ ఏంజిలిస్‌లోని శాంటా మోనికా బీచ్‌లో(Santa Monica Beach) గురువారం ఈ దుర్ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్(Viral Video) అవుతోంది. సాంకేతిక సమస్య(Technical Glitch) కారణంగా విమానం అత్యవసరంగా సముద్ర తీరంలో దిగాల్సి వచ్చింది. తొలుత తీరంవైపు నెమ్మదిగా దిగిన విమానం ల్యాండయిన మరుక్షణమే బోల్తా పడింది. శాంటా మోనికా ఎయిర్‌పోర్టు నుంచి బయలు దేరిన తొమ్మిది నిమిషాలకే ఈ ప్రమాదం జరిగింది. మాలీబూ వైపు బయలుదేరిన విమానం పెసిఫిక్ పాలిసేడ్స్‌కు చేరుకోగానే సాంకేతిక తలెత్తినట్టు పైలట్ గుర్తించారు. అయితే..వెంటనే శాంటామోనికా ఎయిర్‌పోర్టుకు వెళదామని ప్రయత్నించిన పైలట్.. పరిస్థితి అనుకూలించక సముద్ర తీరంలో విమానాన్ని దించేశారు.

‘‘బీచ్‌లో ల్యాండింగ్ ప్రమాదకరం. నిర్ణయం మీదే’’ అని పైలట్‌ను ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోలర్ అంతకుమునుపే హెచ్చరించగా.. ‘‘మరో దారి లేకే ఈ నిర్ణయం తీసుకున్నాను’’ అని పైలట్ సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది. ల్యాండయిన వెంటనే విమానం బోల్తా పడటంతో ఇద్దరు ప్రయాణికులు విమానంలోనే చిక్కుకుపోయారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న అత్యవసర సహాయక సిబ్బంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది ఇంకా తెలియరాలేదు. కాగా.. ఈ ప్రమాదంలో బీచ్‌లో ఉన్న ఇతరులెవరూ గాయపడలేదని శాంటా మోనికా అగ్నిమాపక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రమాదంపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ దర్యాప్తు ప్రారంభించాయి.

Updated Date - 2022-12-23T20:13:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising