USA: ఆ వీడియో లీక్ చేస్తానంటూ అమెరికా ప్రొఫెసర్‌కు భారతీయ యువకుడి బెదిరింపులు..
ABN, First Publish Date - 2022-12-03T16:56:19+05:30
అమెరికా ప్రొఫెసర్ బ్లాక్‌మెయిల్ చేసిన ఓ ఢిల్లీ యువకుడిని సీబీఐ తాజాగా అరెస్టు చేసింది.
ఎన్నారై డెస్క్: అమెరికా ప్రొఫెసర్‌ను(US professor) బ్లాక్‌మెయిల్(Blackmail) చేసిన ఓ ఢిల్లీ యువకుడిని సీబీఐ(CBI) తాజాగా అరెస్టు చేసింది. అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ-FBI) ఇచ్చిన సమాచారంతో సీబీఐ అధికారులు నిందితుడు రాహుల్ కుమార్‌ను అదుపులోకి(Arrest) తీసుకున్నారు. బాధితుడిని బ్లాక్ మెయిల్ చేయడంలో రాహుల్‌కు సహకరించిన అతడి గర్ల్‌ఫ్రెండ్ కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు చేపట్టారు.
సీబీఐ ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది రాహుల్ గర్ల్‌ఫ్రెండ్‌కు ఫేస్‌బుక్(Facebook) ద్వారా అమెరికాకు చెందిన ఓ ప్రొఫెసర్‌తో పరిచయమైంది. ఆ తరువాత.. ఆమె అతడితో సాన్నిహత్యం పెంచుకుంది. ఈ క్రమంలో గత సెప్టెంబర్ 10న అతడి వ్యక్తిగత వీడియోను పంపాలని ఆమె కోరింది. అమెరికా ప్రొఫెసర్ ఆమె చెప్పినట్టే చేశాడు. ఆ తరువాత..తమ విషయం తన బాయ్‌ఫ్రెండ్‌కు తెలిసిపోయిందని చెప్పింది. తమ వీడియో కాల్‌ను రాహుల్ రికార్డు చేశాడని కూడా పేర్కొంది. ఈ క్రమంలోనే ఆ ఇద్దరు కలిసి అమెరికా ప్రొఫెసర్‌ను బ్లాక్ మెయిల్ చేశారు. ఆయన వీడియోలను యూనివర్సిటీ అధికారులకు, అమెరికా జర్నలిస్టులకు పంపిస్తామంటూ బెదిరించి ప్రొఫెసర్ నుంచి 48 వేల డాలర్లు దోచుకున్నారు. చివరకు అమెరికా ఎఫ్‌బీఐ రంగంలో దిగడంతో ఆ ఇద్దరి బండారం బయటపడింది. భారత్‌లోని సీబీఐ అధికారులకు ఎఫ్‌బీఐ సమాచారం అందించడంతో పోలీసులు రాహుల్‌ను తాజాగా అరెస్ట్ చేశారు.
Updated Date - 2022-12-03T16:59:08+05:30 IST