NRI: జాబ్ పోయిందా.. హెచ్-1బీ వీసా గడువు దగ్గరపడుతోందా.. అయితే..

ABN, First Publish Date - 2022-11-19T21:33:28+05:30

అమెరికా జాబ్ కోల్పోయాక హెచ్-1బీ వీసాదారుల ముందున్న ప్రత్యామ్నాయమార్గాలు ఇవే..

NRI: జాబ్ పోయిందా.. హెచ్-1బీ వీసా గడువు దగ్గరపడుతోందా.. అయితే..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: మాంద్యం ముంచుకొస్తోందంటూ అమెరికాలోని బడా టెక్ సంస్థలు ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. వేల సంఖ్యలో ఉద్యోగులను అకస్మాత్తుగా తీసేస్తున్నాయి. ఇలా సడెన్‌గా ఉపాధి కోల్పోయిన వారిలో విదేశీ వీసాదారులు కూడా ఉన్నారు. హెచ్-1బీ వీసా లాంటి వర్క్ వీసాలతో ఉపాధి పొందుతున్న వారు తాజా పరిణామాల నేపథ్యంలో టెన్షన్ పడుతున్నారు. 60 రోజుల్లో హెచ్-1బీ వీసాదారులు కొత్త ఉద్యోగం పొందాలన్న నిబంధనే వారి ఆందోళనకు కారణం. అయితే.. ఈ పరిస్థితి నుంచి గట్టేందుకు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటంటే..

కొత్త కంపెనీల్లో ఇంటర్వ్యూల కోసం విస్తృతంగా ప్రయత్నించాలి. స్టార్టప్ సంస్థల్లోనూ ఉద్యోగాలకు ట్రై చేయాలి. ఇందుకోసం ఎంజిల్ లిస్ట్ సాయం తీసుకోవచ్చు. శాలరీ ఎంత అనేది పట్టించుకోకుండా..మరో ఉద్యోగం సంపాదించడమే లక్ష్యంగా ప్రయత్నాలు చేయాలి

చిన్న సంస్థలను లేఖల ద్వారా సంప్రదించి తమ పరిస్థితిని వివరించాలి.

ప్రస్తుత నిబంధనల ప్రకారం.. కొత్తగా ఉద్యోగంలో చేరిన పది రోజులలోపే కంపెనీ.. ఉద్యోగి తరపున ఎల్‌సీఏ, హెచ్-1బీ దరఖాస్తు చేయాలి. అంతేకాకుండా.. ప్రీమియం ప్రాసెసింగ్ దరఖాస్తు చేయగలిగితే..వీసా వచ్చిందీ రానిదీ 15 రోజుల్లోపే తేలిపోతుంది. ఇక అధికారులకు..వీసాదరఖాస్తు దారుల ఐ-129 పారం 60 రోజుల్లోపు అందాలన్న విషయం మర్చిపోకూడదు. కాబట్టి.. ఈ అంశాలన్నీ దృష్టిలోపెట్టుకుని ఉద్యోగప్రయత్నాలు చేయాలి.

జాబ్ లభించని పక్షంలో అమెరికా వీడాల్సిన పరిస్థితి తప్పదు. అయితే..ఇందులో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇలాంటి వారికి మరోసారి అమెరికా లాటరీ అవసరం లేకపోవడంతో అమెరికా ఉద్యోగం సులభంగానే దొరికే అవకాశం ఉంది. అయితే..ఈ మారు మళ్లీ ‘కాన్సులార్ ప్రాసెసింగ్’ తప్పదు కాబట్టి.. ఇంటర్వ్యూలు వంటి వాటి కోసం కొంత సమయం పట్టొచ్చు.

ఇక ప్రత్యేకనైపుణ్యాలున్న వారికి ఇచ్చే ఓ-1కు కూడా దరఖాస్తు చేయవచ్చు. మీరు దీనికి అర్హులా కాదా అనేది అమెరికా లాయర్లను సంప్రదిస్తే తేలిపోతుంది. దీనికి కంపెనీలతో సంబంధం లేకపోవడం ఓ సానుకూలాంశం కాగా.. ప్రీమియం ప్రాసెసింగ్ పద్ధతిని ఎంచుకుంటే వేగంగా వీసా పొందొచ్చు.

ఉద్యోగంలోంచి తీసేసేటప్పుడు కంపెనీ ఇచ్చే సెవరెన్స్ పే(పరిహారం) తగ్గించుకుని ఉద్యోగకాలాన్ని పొడిగించుకునే అవకాశం ఉందేమో తెలుసుకోవాలి. ఈ విషయాన్ని సంస్థలతో చర్చించాలి. ఈ ఏడాది చివరకు ఉద్యోగంలో కొనసాగగలిగితే ఆ తరువాత హాలిడే సీజన్‌లో ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి.

ఈ విషయంలో జీవితభాగస్వామి సాయం కూడా తీసుకోవచ్చు

ఇక ఎఫ్-1వీసాపై చిన్న చిన్న కాలేజీల్లో మళ్లీ చేరి అమెరికాలో మరింత కాలంపాటు కొనసాగేలా ప్రయత్నించడం హెచ్-1బీ వీసాదారుల ముందున్న మరో ప్రత్యామ్నాయం.

విజిటర్ వీసా(బీ-1)కు మారే అవకాశం ఉందేమో కంపెనీతో చర్చించాలి. తద్వారా మళ్లీ ఉపాధి దొరికాక హెచ్-1బీ వీసాకు మారిపోవచ్చు.

Updated Date - 2022-11-19T23:29:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising