ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: అమెరికాలో పరిస్థితి ఇదా.. షాకిస్తున్న వాస్తవాలు..

ABN, First Publish Date - 2022-11-22T16:39:39+05:30

మెటా, అమెజాన్, ట్విటర్ వంటి దిగ్గజ టెక్ సంస్థల్లో ఉద్యోగాల కొత.. హెచ్-1బీ వీసాదారులను ఒడిదుడుకుల పాలు చేసింది. ఈ తొలగింపుల ప్రభావం తమపైనే అధికంగా ఉందని భారతీయులు గగ్గోలు పెడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: మెటా(Meta), అమెజాన్, ట్విటర్ వంటి దిగ్గజ టెక్ సంస్థల్లో ఉద్యోగాల కోత(Massive Layoffs).. హెచ్-1బీ వీసాదారులను(H-1B Visa) ఒడిదుడుకుల పాలు చేసింది. ఈ తొలగింపుల ప్రభావం తమపైనే అధికంగా ఉందని భారతీయులు గగ్గోలు పెడుతున్నారు. ఉద్యోగం కోల్పోయిన వారు.. 60 రోజుల వీసా గ్రేస్ పీరియడ్‌లోపు మరో సంస్థలో చేరాలి. లేకపోతే.. స్వదేశానికి తిరిగి వెళ్లకతప్పదు. ఈ క్లిష్టపరిస్థితుల్లో సంస్థలు ఆశించిన స్థాయిలో మార్గనిర్దేశనం కూడా చేయట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అమెరికా టెక్ సంస్థలు ఇప్పటివరకూ హెచ్-1బీ వీసాపై అధికంగా ఆధారపడిన విషయం తెలిసిందే. అమెజాన్(Amazon), లిఫ్ట్(Lyft), మెటా(Meta), సేల్స్‌ఫోర్స్(Salesforce), స్ట్రైప్(Stripe), ట్విటర్(Twitter) వంటి సంస్థలు భారీ స్థాయిలో హెచ్-1బీ వీసాలను స్పాన్సర్ చేసి కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ రంగాలకు చెందిన విదేశీ నిపుణులను అమెరికాలో నియమించుకున్నాయి. గత మూడేళ్లల్లో ఈ సంస్థలు సుమారు 45 వేల పైచిలుకు వీసాలు స్పాన్సర్ చేసినట్టు ప్రముఖ వార్తాసంస్థ బ్లూమ్‌బర్గ్ జరిపిన అధ్యయనంలో తేలింది.

హెచ్-1బీ వీసాపై అనేక మంది భారతీయులు కొన్నేళ్లుగా అగ్రరాజ్యంలో నివసిస్తున్నారు. గ్రీన్ కార్డు కోసం కళ్లుకాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కొందరు ఇంటి లోన్స్, స్టూడెంట్ లోన్స్ వంటివి కట్టుకుంటూ కుటుంబాలతో కలిసి నివసిస్తున్నారు. ఇలాంటి స్థితిలో ఉద్యోగం కోల్పోయి చిక్కుల్లో పడిపోయారు. మరోవైపు.. మార్కెట్లో ఉద్యోగాల కోసం తీవ్రపోటీ నెలకొనడంతో హెచ్-1బీ వీసాదారుల పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. ఇది చాలదన్నట్టు.. అనేక కంపెనీలు ఉద్యోగనియామకాలను తాత్కాలికంగా నిలిపివేయడంతో సమస్య మరింత జటిలమైంది.

అనేక మంది హెచ్-1బీ వీసాదారులు తమ సమస్యలను బహిరంగంగా చర్చించేందుకు వెనకాడుతున్నారు. గతంలో తాము పనిచేసిన సంస్థలకు ఆగ్రహం కలగచ్చన్న ఉద్దేశంతో వెనకడుగు వేస్తున్నారు. దాదాపు 14 ఏళ్ల పాటు అమెరికాలో ఉన్న తాను ఇటీవల ఉద్యోగం కోల్పోయానని ఓ మహిళ(30)స్థానిక మీడియా వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తన పేరు చెప్పేందుకు ఇష్టపడని ఆమె.. ఇలాంటి రోజు ఒకటి వస్తుందన్న తన భయం ఈరోజు నిజమైందని వ్యాఖ్యానించారు. ఇటీవల ట్విటర్‌లో ఉద్యోగాలు కోల్పోయిన 3500 మందిలో ఆమె కూడా ఒకరు. అమెరికా వీడక తప్పదేమో అంటూ నిస్సహాయత వ్యక్తం చేశారు.

ఏటా అమెరికా సుమారు 85 వేల పైచిలుకు హెచ్-1బీ వీసాలు జారీ చేస్తుంది. లబ్ధిదారుల్లో భారతీయులే అధికం. అమెరికన్ ఉద్యోగులు తక్కువగా ఉన్న రంగాల్లో విదేశీయులను నియమించుకునేందుకు సంస్థలకు ఈ వీసా ప్రోగ్రామ్ అనుమతిస్తుంది. టెక్ రంగంలోని హెచ్-1బీ వీసాదారుల సగటు శాలరీ 1,06,000 డాలర్లు(రూ.86 లక్షలు). మెటా వంటి బడా సంస్థల్లో పనిచేసేవారు సగటున 175000 డాలర్ల వరకూ ఆర్జిస్తారట. కంపెనీలు ఇచ్చే ప్రోత్సాహకాలు, స్టాక్ ఆప్షన్లు వీటికి అదనం. మూడేళ్ల కాలపరిమితితో ఇచ్చే ఈ వీసాలను మరింత కాలం పాటు పొడిగించుకునే సదుపాయం ఉంది.

ఇదీ చదవండి: జాబ్ పోయిందా.. హెచ్-1బీ వీసా గడువు దగ్గరపడుతోందా.. అయితే..

ఇక తాత్కాలిక వర్క్ వీసాలపై నివసించేవారిలో భారతీయులే అధికంగా ఉన్నారని అక్కడి పరిశీలకులు చెబుతున్నారు. గ్రీన్ కార్డు కోసం ఏళ్లతరబడి ఎదరుచూడాల్సి రావడంతో తాత్కాలిక వీసాలపైనే అమెరికాలో నివసిస్తున్నారు. ఉద్యోగఆధారిత గ్రీన్ కార్డులపై అమెరికా దేశాలవారీగా సగటున ఏడు శాతం పరిమితి విధించింది. అంటే.. ఏటా గ్రీన్ కార్డుల(Green Card) కోసం సగటున మిలియన్ మంది భారతీయులు ఎదురుచూస్తుంటే..కేవలం పది వేల గ్రీన్ కార్డులు మాత్రమే జారీ అవుతున్నాయి. అమెరికా చట్టసభల అధ్యయనం ప్రకారం.. 2020లో గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న భారతీయులు కొన్ని సందర్భాల్లో 195 ఏళ్లు వరకూ ఎదురుచూడాలి. చైనా విషయంలో ఈ వెయిటింగ్ పీరియడ్ 18 ఏళ్లు కాగా.. ఇతర దేశాల వారికి మాత్రం వెయిటింగ్ పీరియడ్ ఏడాది లోపేనట. ఈ పరిస్థితుల్లో ఉద్యోగాలు కోల్పోవడంతో భారతీయులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఏడాది క్రితం మెటా జాబ్ భరోసాతో ఇల్లుకొన్న ఓ భారతీయుడు ప్రస్తుతం ఇక్కట్లు ఎదుర్కొంటున్నాడు. అకస్మాత్తుగా జాబ్ పోవడంతో మళ్లీ ఉద్యోగవేట ప్రారంభించిన అతడు తనకు తెలిసి వారితో పాటూ లింక్డ్‌ఇన్ సైట్ల ద్వారా విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు.

ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ వీసాదారుల్లో కొందరికి తమ 60 రోజుల గ్రేస్ పీరియడ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో కూడా స్పష్టత లేదు. ఈ విషయంలో కంపెనీల నుంచి ఆశించిన సాయం అందటం లేదు. చట్టంలోని నిబంధనలను వివిధ రకాలుగా నిర్వచించే ఆస్కారం ఉందని ఓ కంపెనీ ప్రతినిధి వ్యాఖ్యానించారు. కాబట్టి.. హెచ్-1బీ వీసాదారులు ఈ విషయంలో లాయర్‌ను సంప్రదించాలని సూచించారు. ప్రముఖ కంపెనీలు అనేకం ఇటువంటి సూచనే ఇచ్చాయని అక్కడి వారు అంటున్నారు. మరోవైపు.. అక్కడి ఇండియన్లు.. సాటి భారతీయులను ఆదుకునేందుకు నడుం కట్టారు. జాబ్ కోల్పోయిన వారి వివరాలతో ఓ జాబితా రూపొందించి తమ నెట్వర్క్ ద్వారా ఉద్యోగావకాశాల గురించి చెబుతున్నారు. మరికొందరు భారతీయులు స్వదేశానికి తిరిగొచ్చేందుకే నిర్ణయించుకున్నారు. స్వదేశంలోనే కంపెనీలు ప్రారంభిస్తామని కొందరు..వృద్ధులైన తలిదండ్రులకు తోడుగా ఉంటామని మరికొందరు చెబుతున్నారు.

Updated Date - 2022-11-22T16:58:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising