ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: ఇండియాలో ఉండగానే ఎన్నారై జీవితం తలకిందులు.. తల్లిదండ్రుల ముందు నటించాల్సి వస్తోందంటూ..

ABN, First Publish Date - 2022-12-11T20:41:23+05:30

అమెరికా టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు పర్వం .. ఎన్నారైల జీవితాలను ఒక్కరోజులో తలకిందులు చేసింది. తీవ్ర ఒడిదుడుకుల పాలవుతున్న ఎన్నారైల ఉదంతాలు ఇప్పటికీ వెలుగు చూస్తూనే ఉన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అమెరికా టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు పర్వం(US IT layoffs).. ఎన్నారైల(NRI) జీవితాలను ఒక్కరోజులో తలకిందులు చేసింది. తీవ్ర ఒడిదుడుకుల పాలవుతున్న ఎన్నారైల ఉదంతాలు ఇప్పటికీ వెలుగు చూస్తూనే ఉన్నాయి. అమెరికా ఉద్యోగం పోయిన విషయాన్ని ఇప్పటికీ చెప్పలేదని ఇండియాలోని ఓ ఎన్నారై తాజాగా మీడియాకు తెలిపారు. ఇటీవల ఫేస్‌బుక్(Facebook) మాతృసంస్థ మెటా సంస్థ(Meta) ఏకంగా 11 వేల మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సింగపూర్‌లో(Singapore) పనిచేసే అర్పన్ తివారీ(Arpan Tiwari) కూడా ఉద్యోగం పోగొట్టుకున్నాడు. సెలవులపై ఇండియాలో ఉండగా అతడికి తాను ఉద్యోగం పోగొట్టుకున్న విషయం తెలిసింది. కానీ..తనను చూసిన సంతోషంలో ఉన్న తల్లిదండ్రులకు జాబ్ పోయిన విషయాన్ని అర్పన్ చెప్పలేకపోయాడు. దీంతో.. వారి మందు సంతోషాన్ని నటించడం అతడి దిన చర్యగా మారింది. ‘‘ఈ మొత్తం వ్యవహారంలో నన్ను బాగా బాధించేది ఇదే. వారిని బాధ పెట్టడం ఇష్టం లేక నేను అంతా సవ్యంగా ఉన్నట్టు నటిస్తున్నాను.’’ అని అతడు జాతీయ మీడియాకు ఇటీవల తెలిపాడు. అంతేకాదు.. తనకు మరో జాబ్ వచ్చే వరకూ ఈ రహస్యాన్ని తల్లిదండ్రులకు చెప్పనని అర్పన్ స్పష్టం చేశాడు.

తన ఒత్తిడిని అమ్మానాన్నలకు బదలాయించేందుకు మనస్కరించలేదని చెప్పిన అర్పన్.. తల్లిదండ్రుల ముందు నిజాన్ని దాచాల్సి రావడం తనని మానసికంగా కుంగదీస్తోందని చెప్పాడు. అర్పన్‌కు తన ఉద్యోగం పోవడానికి కారణమేంటో ఇప్పటికీ తెలియదు. ‘‘సంస్థలో నేను పని చేసిన కాలం, నా ట్రాక్ రికార్డ్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని తొలగించినట్టు ఫేస్‌బుక్ నుంచి లేఖ అందినట్టు చెప్పుకొచ్చాడు. అయితే.. తనకు తెలిసి సంస్థలో అధికశాతం మంది తమకు విధించిన టార్గెట్‌లను మించి పనితీరు కనబర్చారని కూడా అర్పన్ వివరించాడు. అమెరికాలోని ఎన్నారైల్లో అత్యధికులు హెచ్-1బీ, ఎల్-1వీసాలపై అక్కడి సంస్థల్లో పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇక హెచ్-1బీ వీసా నిబంధనల ప్రకారం.. అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన విదేశీయుడు తదుపరి 60 రోజుల్లో కొత్త ఉద్యోగం సంపాదించాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఎన్నారైల హెచ్-1బీ వీసా గడువు ముగిసి వారు స్వదేశానికి తరలి రావాల్సి ఉంటుంది.

Updated Date - 2022-12-11T21:05:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising