ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: టాంపా నగరంలో NRI TDP ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు

ABN, First Publish Date - 2022-12-04T21:45:09+05:30

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోగల టాంపా నగరంలో NRI TDP ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోగల టాంపా నగరంలో NRI TDP ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమాంలో అతిథులుగా NRI TDP-USA కోఆర్డినేటర్ కోమటి జయరాం, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్ మన్నవ మోహనకృష్ణ, తానా మాజీ అధ్యక్షులు వేమన సతిష్, నాట్స్ మాజీ ఛైర్మన్ గుత్తికొండ శ్రీనివాస్, మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కోమటి జయరాం మాట్లాడుతూ NTR శత జయంతి ఉత్సవాలు సంవత్సరమంతా జరపాలని జాతీయ తెలుగుదేశం పార్టీ నిర్ణయించిన ఆదేశాలను అనుసరిస్తూ క్రమం తప్పకుండా అమెరికాలో ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న NRI TDP USA వారిని అధినందించారు. ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు తెలుగుజాతికి అపూర్వ శక్తిని అందించాయని, తెలుగుజాతి కీర్తిని ప్రపంచ నలుమూలలా చాటిన వ్యక్తి ఎన్టీ రామారావు అని అన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి బడుగు బలహీన వర్గాలకు భాగ్యస్వామ్యం కల్పించి అభ్యుదయవాదిగా నిలిచారని, తెలుగుదేశం పార్టీ ద్వారా ప్రజలకు ఎన్నో సేవలు అందించారన్నారు. NRIలు రాబోయే ఎన్నికలలో కీలక పాత్ర పోషించాలని, తెలుగు దేశం పార్టీ విజయానికి NRIలు కృషి చెయ్యాలని కోరారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్ మన్నవ మోహనకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ అంతటి మహోన్నత వ్యక్తిని స్మరించుకోవడం తెలుగువారి అదృష్టం అని అన్నారు. ఎన్టీఆర్ నటుడిగా, రాజకీయ నాయకుడిగా, సంక్షేమ పథకాల ప్రధాతగా దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచారన్నారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. అన్న గారిని ఆదర్శంగా తీసుకొని నేటి యువత ముందుకు సాగాలి అని మోహన కృష్ణ ఆకాంక్షించారు. ‘‘నందమూరి తారక రామారావు గారు తెలుగు వారి ఆత్మగౌరవం నినాదంతో, తెలుగు జాతి అభివృద్ధి కోసం చంద్రబాబు గారు ఏ విధంగా కష్టపడి పని చేశారో మనందరికీ తెలుసు. ఈ రోజు ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతూ, శాంతి భద్రతలు విషయంలో విఫలం అవ్వటం వలన ఏ విధంగా అభివృద్ధి కుంటుపడుతుందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్వార్ధపూరిత రాజకీయ కుట్రల వలన వ్యవస్థలు ఏ రకంగా గాడి తప్పుతున్నాయో చూస్తున్నాం. మనమందరం అప్రమత్తం అయ్యి రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని మన్నవ మోహన కృష్ణ గుర్తుచేశారు. NRI TDP టాంపా కమిటీ కార్యవర్గాన్ని ప్రకటించిన అనంతరం కమిటీ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

Updated Date - 2022-12-04T21:52:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising