ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

TANA: విరాళాల సేకరణలో తానా సరికొత్త రికార్డు

ABN, First Publish Date - 2022-11-07T20:56:15+05:30

తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం- TANA) 23వ మహాసభల సన్నాహక కార్యక్రమ విందులో పెద్ద ఎత్తున తెలుగు ప్రజలు పాల్గొని చారిత్రాత్మిక స్థాయిలో విరాళాలు ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం- TANA) 23వ మహాసభల సన్నాహక కార్యక్రమ విందులో పెద్ద ఎత్తున తెలుగు ప్రజలు పాల్గొని చారిత్రాత్మిక స్థాయిలో విరాళాలు ప్రకటించారు. 45 సంవత్సరాల చరిత్రలో తానా.. మహాసభల విరాళాల(Donations) సేకరణలో సరికొత్త రికార్డు సృష్టించింది. కోవిడ్ మహమ్మారి తీవ్రతతో 2021లో నిర్వహించాల్సిన మహాసభలు వాయిదాపడి దాదాపు నాలుగేళ్ళ తర్వాత ఫిలడెల్ఫియా నగరంలో(Philadelphia) 2023 జులై 7 నుండి 9 వరకు తానా మహాసభలు జరగనున్నాయి. ఈ క్రమంలో జరుగుతున్న సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా నవంబర్ 5న పెన్సిల్వేనియా రాష్ట్రంలోని వార్మిన్స్టర్ నగరంలోని ఫ్యూజ్ బ్యాంక్వెట్ హాల్‌‌లో జరిగిన విరాళాల సేకరణ కార్యక్రమానికి అంచనాలకి మించిన స్పందన లభించింది. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, కన్వీనర్ పొట్లూరి రవి ఆధ్వర్యంలో నిర్వహించిన విరాళాల సేకరణ విందులో ఎనిమిది వందల మందికి పైగా ప్రవాసులు పాల్గొని గతంలో జరిగిన అన్ని విరాళాల సేకరణని మించిపోయేలా దాదాపు నలభై ఎనిమిది కోట్ల రూపాయల(ఆరు మిలియన్ల డాలర్లు) విరాళాలు ప్రకటించారు.

3.jpg

తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి.. హాజరైన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, EC, BOD, ఫౌండేషన్ సభ్యులు, మాజీ అధ్యక్షులు, ఇతర కమిటీ సభ్యులను పరిచయం చేసి సమాజానికి వారు చేసిన సేవలను కొనియాడారు. తానా సభ్యులు, వాలంటీర్లు, దాతలు.. సంఘం అభివృద్ధికి వారు చేసిన కృషిని, సమాజానికి చేసిన సేవలను అభినందించారు. 23వ తానా మహాసభల ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి దాతను పరిచయం చేసి మరియు గుర్తించడానికి సమయాన్ని వెచ్చించి ఆనందోత్సాహాలు, కరతాళధ్వనులు మధ్య నిధుల సేకరణ కార్యక్రమం ఆసక్తికరంగా సాగింది. ప్రతిష్టాత్మక తానా మహాసభలు దాదాపు నాలుగేళ్ళ తర్వాత నిర్వహిస్తుండటంతో పాటు అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు నేతృత్వంలోని తానా కార్యవర్గం గత పదహారు నెలలుగా చేసిన సేవలు, చేపట్టిన వినూత్నమైన కార్యక్రమాలు ప్రవాస భారతీయుల్లో 23వ తానా మహాసభల పట్ల ఆసక్తిని పెంచాయని, విరాళాల సేకరణ కార్యక్రమానికి ఊహించని స్పందన లభించిందని మహాసభల కన్వీనర్ పొట్లూరి రవి తెలిపారు. విరాళాల కార్యక్రమ నిర్వహణకు సహకరించిన పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్, డెక్కన్ స్పైస్ గోవర్ధన్ బోబ్బా, జగదీశ్ యలమంచిలి, వాలంటీర్లకు కృతఙ్ఞతలు తెలియజేశారు.

1.jpg2.jpg

Updated Date - 2022-11-07T20:56:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!