Terra solis Dubai: రారమ్మని పిలుస్తున్న ఎడారి అందాలు.. ఇక్కడకు టూర్ ప్లాన్ చేస్తే..

ABN , First Publish Date - 2022-11-07T18:27:23+05:30 IST

ఇసుక తిన్నెలు, ఓయాసిస్, రాత్రుళ్లు ఆకాశంలో మిలమిలా మెరిసే నక్షత్రాలు.. ఇలా ఎడారి అందాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దీనికి కమ్మని సంగీతం కూడా తోడైతే ఆ అనుభూతిని ఇక మాటల్లో వర్ణించలేం. అచ్చు ఇలాంటి అనుభూతిని పర్యాటకులకు పంచేందుకు ముందుకొచ్చింది టెర్రా సోలిస్ దుబాయ్.

Terra solis Dubai: రారమ్మని పిలుస్తున్న ఎడారి అందాలు.. ఇక్కడకు టూర్ ప్లాన్ చేస్తే..

ఇసుక తిన్నెలు, ఓయాసిస్, రాత్రుళ్లు ఆకాశంలో మిలమిలా మెరిసే నక్షత్రాలు.. ఇలా ఎడారి అందాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దీనికి కమ్మని సంగీతం కూడా తోడైతే ఆ అనుభూతిని ఇక మాటల్లో వర్ణించలేం. అచ్చు ఇలాంటి అనుభూతిని పర్యాటకులకు పంచేందుకు ముందుకొచ్చింది టెర్రా సోలిస్ దుబాయ్(Terra solis dubai). దుబాయ్ హెరిటేజ్ విజన్ ప్రాంతంలో.. ఈ టూరిస్ట్ డెస్టినేషన్ నవంబర్‌లో ప్రారంభం కానుంది. సంగీత సంరంభమైన టుమారో‌ల్యాండ్ మ్యూజిక్ ఫెస్టివల్‌కు టెర్రా సోలిస్ దుబాయ్‌ వేదిక కానుంది. ప్రకృతి అందాలు, టుమారోల్యాండ్ ఫెస్టివల్ సంగీత ప్రపంచం స్ఫూర్తితో వీటిని సిద్ధం చేశామని టెర్రా సోలిస్ వ్యవస్థాపకుడు నికొలాస్ వాన్‌డెన్‌బీలీ తెలిపారు.

అద్భుతమైన పూల్, నోరూరించే రుచులతో కూడిన సాటిలేని పర్యాటక అనుభవం అతిథుల సొంతమవుతుందని చెప్పారు. మ్యూజిక్, ఎంటర్‌టైన్‌మెంట్, పార్టీ వాతావరణం.. టూరిస్టులను పునరుత్తేజితం చేస్తుందన్నారు. టెర్రా సోలిస్‌లోని బెల్ టెంట్స్, 20 పెర్సీడ్ లాడ్జిలు, ఆరు ఓరియాన్ పూల్ లాడ్జ్‌లు ఉన్నాయి. అతిథుల కోసం అద్భుత రుచులతో లంచ్, డిన్నర్ ఏర్పాట్లు చేశారు. ఇక పూల్ పక్కన బార్‌లో పలు రకాల డ్రింక్స్, కాక్‌టెయిల్స్ ఏర్పాటు చేశారు. దుబాయ్ ఎయిర్‌పోర్టు నుంచి కేవలం 30 నిమిషాల్లో టెర్రా సోలిస్‌కు చేరుకోవచ్చు. అత్యద్భుత టూరిజం అనుభవాలను చవిచూడాలనుకునే టెర్రా సోలిస్ దుబాయ్‌కు తప్పక రావాలని నిర్వాహకులు చెబుతున్నారు. బుకింగ్స్ కోసం https://terrasolisdubai.com/en/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Updated Date - 2022-11-07T19:53:19+05:30 IST

Read more