ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Visa-free entry: ఆ దేశాల వారికి ఒమన్ బంపరాఫర్..!

ABN, First Publish Date - 2022-10-28T08:26:28+05:30

గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (Gulf Cooperation Council) దేశాల నివాసితులకు (Residents) ఒమన్ బంపరాఫర్ ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మస్కట్: గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (Gulf Cooperation Council) దేశాల నివాసితులకు (Residents) ఒమన్ బంపరాఫర్ ప్రకటించింది. అసలు వీసాయే అవసరం లేకుండా సుల్తానేట్‌లో ప్రవేశానికి అనుమతి ఇచ్చింది. జీసీసీ (GCC) రెసిడెంట్స్‌కు అన్ని వాణిజ్య వృత్తుల కోసం ఒమన్‌లోకి వీసా-ఫ్రీ ఎంట్రీకి (Visa-free entry) అనుమతి ఉందని ఒమన్ ఎయిర్‌పోర్ట్స్ తన సర్క్యులర్‌లో పేర్కొంది. జీసీసీ నివాసితుల వీసాకు సంబంధించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ అండ్ రెసిడెన్స్ నుంచి ఒమన్ విమానాశ్రయాలకు అందిన ఆదేశాల ఆధారంగా ఈ సర్క్యులర్ జారీ చేసినట్లు తెలియజేసింది. జీసీసీ దేశాలలోని నివాసితులందరికీ అన్ని వాణిజ్య వృత్తుల కోసం సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లోకి ప్రవేశించే హక్కు ఉంటుంది. ప్రజలు నివసించే దేశం నుండి రావాల్సిన అవసరం లేదు. ఈ సదుపాయాన్ని పొందేందుకు ఏ సమయంలోనైనా వారు ఏ గమ్యస్థానం నుంచి వచ్చినా ఒమన్‌లోకి అనుమతించనున్నట్లు ఒమన్ ఎయిర్‌పోర్ట్స్ వెల్లడించింది. అయితే, నివాస వీసా మూడు నెలల కంటే తక్కువ వ్యవధిలో జీసీసీలో చెల్లుబాటయ్యేలా ఉండాలని స్పష్టం చేసింది. ఒమన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల జీసీసీ దేశాల నివాసితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-10-28T08:26:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising