ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Royal Enfield: బుల్లెట్ బండి ధర కేవలం రూ.19వేలు.. మరీ ఇంత తక్కువకా!

ABN, First Publish Date - 2022-12-29T12:50:40+05:30

ఇప్పుడు బుల్లెట్ బండి(Bullet Bike) గురించిన ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే.. ప్రస్తుతం ఆ బండికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. దాన్ని నెటిజన్లు షాకవుతున్నారు. బుల్లెట్ 350 సీసీ బైక్ కేవలం రూ.19వేలకే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: బుల్లెట్ బైక్.. ఈ పేరు వింటే చాలు చాలా మంది యువకుల ముఖాల్లో ఏదో తెలియని సంతోషం కనిపిస్తుంది. బుల్లెట్ బండిపై రోడ్డు మీద దూసుకుపోవాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. అయితే.. ఇప్పుడు బుల్లెట్ బండి(Bullet Bike) గురించిన ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే.. ప్రస్తుతం ఆ బండికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. దాన్ని నెటిజన్లు షాకవుతున్నారు. బుల్లెట్ 350 సీసీ బైక్ కేవలం రూ.19వేలకే వచ్చిందని తెలుసుకుని కంగుతింటున్నారు. ఈ నేపథ్యంలో అసలు విషయం ఏంటనే వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం 350 సీసీ బుల్లెట్(Royal Enfield Bike) బండి ధర మార్కెట్‌లో దాదాపు రూ.1.60లక్షల వరకూ ఉంది. కానీ ఇదే కొత్త 350 సీసీ(Bullet 350CC) బండి కేవలం రూ.18,700లకే లభించింది. అయితే ఇది ఇప్పటి మాట కాదు.. కొన్నేళ్ల క్రితంది. 1986 సంవత్సరానికి సంబంధించిన బుల్లెట్ బండి తాలూకు బిల్ కాపీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పుడు ఆ బండి ధర లక్షల్లో.. ఉన్నా అప్పట్లో వేలల్లోనే ఉన్నట్టు ఈ బిల్ కాపీని చూస్తే తెలుస్తోంది. జనవరి 23, 1986న 350 సీసీ బుల్లెట్ బండి ధర రూ.18,800 ఉండగా.. జార్ఖండ్‌లోని షో రూమ్ వాళ్లు రూ.100 డిస్కౌంట్ ఇచ్చి మరీ కేవలం రూ.18,700లకే కస్టమర్‌కు బైక్‌(Royal Enfield Bike)ను విక్రయించినట్టు ఆ బిల్ కాపీని చూస్తే అర్థం అవుతోంది.

ఇది కూడా చదవండి: Dubai: రూ.30 కోట్లు గెలిచిన జగిత్యాల యువకుడు షాకింగ్ కామెంట్స్

ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ బిల్ కాపీ పట్ల నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ‘అప్పట్లో బండి ధర.. ఇప్పుడు నెల ఇన్స్టాల్‌మెంట్‌కు సమానం’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఆ పోస్ట్‌ను 22వేల మంది లైక్ చేశారు.

Updated Date - 2022-12-29T13:19:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising