ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Meena: రెండో పెళ్లిపై మీనా క్లారిటీ

ABN, First Publish Date - 2022-12-01T19:14:26+05:30

దక్షిణాదిలోని స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన హీరోయిన్ మీనా (Meena). ఇటీవలే ఆమె భర్త విద్యా సాగర్ (Vidya Sagar) మరణించాడు. రెండు, మూడు రోజులుగా మీనారెండో పెళ్లి చేసుకోనుందని వదంతులు షికార్లు కొట్టడం మొదలయ్యాయి. ఈ రూమర్స్‌పై మీనా స్పందించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్షిణాదిలోని స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన హీరోయిన్ మీనా (Meena). ఇటీవలే ఆమె భర్త విద్యా సాగర్ (Vidya Sagar) మరణించాడు. ఆ బాధ నుంచి తేరుకోక ముందే రెండు, మూడు రోజులుగా మీనాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌‌చల్ చేస్తుంది. ఆమె రెండో పెళ్లి చేసుకోనుందని వదంతులు షికార్లు కొట్టడం మొదలయ్యాయి.

తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు కుమార్తె నైనిక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆమె రెండో పెళ్లి చేసుకోనుందని పలు వెబ్‌సైట్స్ కథనాలు రాశాయి. ఈ విషయంపై మీనా స్పందించింది. ఆ రూమర్స్ అన్నింటిని ఖండించింది. తాను మరో పెళ్లి చేసుకోవడం లేదని స్పష్టం చేసింది. తన భర్త మరణించినప్పుడు కూడా అసత్యాలను ప్రచారం చేశారని చెప్పింది. ఆ బాధ నుంచి తేరుకోక ముందే వివాహం ఎలా చేసుకుంటానని పేర్కొంది. ప్రస్తుతం కొత్తగా కథలను వింటున్నానని వెల్లడించింది. ఫిబ్రవరి నుంచి షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్టు తెలిపింది. తన భర్త మరణించినప్పుడు కూడా మీనా సోషల్ మీడియా వేదికగా భావోద్వేగంగా స్పందించింది. ఓ పోస్ట్‌ను అభిమానులతో పంచుకుంది. ‘‘నా భర్త మరణంతో నేను విచారంలో ఉన్నాను. ఈ పరిస్థితిని అర్థం చేసుకుని మా కుటుంబ గోప్యతకు భంగం కల్పించకూడదని కోరుతున్నా. నా భర్త మరణంపై ఎటువంటి అసత్యాలను ప్రచారం చేయకూడదని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కష్టకాలంలో మాకు అండగా నిలచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’’ అని మీనా పోస్ట్ పెట్టింది.

Updated Date - 2022-12-01T19:17:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising