వీడు నిజంగా మంచిదొంగే.. ల్యాప్‌టాప్‌ను చోరీ చేసిందే కాకుండా ఏమని ఈ-మెయిల్ పంపించాడంటే..
ABN, First Publish Date - 2022-10-31T15:39:04+05:30
దొంగలందు మంచి దొంగలు వేరయా అనిపిస్తుంది ఈ చోరీ సంఘటన గురించి వింటే. శనివారం రాత్రి జ్వెల్లీ థిక్సో అనే వ్యక్తి ల్యాప్‌టాప్ చోరీకి గురైంది. కొద్ది సేపటి తర్వాత చోరీ చేసిన వ్యక్తి నుంచి థిక్సోకు ఓ ఈ-మెయిల్ వచ్చింది.
దొంగలందు మంచి దొంగలు వేరయా అనిపిస్తుంది ఈ చోరీ సంఘటన గురించి వింటే. శనివారం రాత్రి జ్వెల్లీ థిక్సో అనే వ్యక్తి ల్యాప్‌టాప్ చోరీకి గురైంది. కొద్ది సేపటి తర్వాత చోరీ చేసిన వ్యక్తి నుంచి థిక్సోకు ఓ ఈ-మెయిల్ వచ్చింది. ల్యాప్‌టాప్ ఎత్తుకెళ్లినందుకు క్షమాపణ చెబుతూ ఆ దొంగ మెయిల్ చేశాడు. మరోదారి లేక దొంగతనం చేశానంటూ వివరణ ఇచ్చాడు. అంతేకాదు ల్యాప్‌టాప్‌లో ఉన్న ముఖ్యమైన ఫైల్స్‌ను కూడా పంపించాడు. థిక్సో ఆ విషయాన్ని ట్విటర్ ద్వారా షేర్ చేసి.. తనకు నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదని కామెంట్ చేశాడు.
నేను ప్రస్తుతం ఆర్థిక కష్టాల్లో ఉన్నాను. మరోదారి లేక మీ ల్యాప్‌టాప్ దొంగతనం చేశాను. నన్ను క్షమించండి. ల్యాప్‌టాప్‌లో ఉన్న మీ రిసెర్చ్ ఫైల్స్ మీకు పంపిస్తున్నాను. ఇంకా అవసరమైన ఫైల్స్ ఎమైనా ఉంటే చెప్పండి. వెంటనే పంపిస్తాన
ని దొంగ ఈ-మెయిల్ చేశాడు. ల్యాప్‌టాప్ పోయినందుకు బాధపడాలో, కష్టపడి చేసిన రిసెర్చ్ ఫైల్స్ తిరిగి దక్కినందుకు సంతోష పడాలో తెలియడం లేదని జ్వెల్లీ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Updated Date - 2022-10-31T15:39:07+05:30 IST