ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గర్భవతి అని తెలిసిన 15 నిమిషాలకే ఓ పాపకు జన్మనిచ్చిన 21 ఏళ్ల యువతి.. కనీవినీ ఎరుగని వింత ఘటన..!

ABN, First Publish Date - 2022-11-05T14:39:43+05:30

ఆ యువతి వయసు 21ఏళ్లు. ఎప్పటిలా ఆ రోజు కూడా కాలేజీకి వెళ్లింది. తరగతి గదిలో ఉండగానే కడుపు నొప్పి ప్రారంభమైంది. దాన్ని తొలుత ఆమె లైట్ తీసుకుంది. కానీ నొప్పి తీవ్రం కావడంతో.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి.. ఆసుపత్రికి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఆ యువతి వయసు 21ఏళ్లు. ఎప్పటిలా ఆ రోజు కూడా కాలేజీకి వెళ్లింది. తరగతి గదిలో ఉండగానే కడుపు నొప్పి ప్రారంభమైంది. దాన్ని తొలుత ఆమె లైట్ తీసుకుంది. కానీ నొప్పి తీవ్రం కావడంతో.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి.. ఆసుపత్రికి బయల్దేరింది. వైద్యులనుని సంప్రదిస్తుండగానే.. ఆమె కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. ఆ యువతి గర్భవతి అని తేల్చేశారు. యువతి పురిటి నొప్పులతోనే బాధపడుతున్నట్టు వెల్లడించారు. అలా ఆ యువతి గర్భవతి అని తెలిసిన 15 నిమిషాలకే పాపకు జన్మనిచ్చింది. వినడానికి వింతగా అనిపించినా ఇది నిజం. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆ యువతి పేరు కైలా సింప్సన్. అమెరికాకు చెందిన ఈ యువతి.. ఇండియానా యూనివర్సిటీలో చదువుకుంటోంది. ఎప్పటిలాగే కాలేజీకి వెళ్లిన ఈ యువతికి తీవ్ర కడుపు నొప్పి ప్రారంభం కావడంతో.. స్థానికంగా ఉన్న వైద్యులను సంప్రదించింది. కుటుంబ సభ్యుల సమక్షంలో యువతికి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. కైలా గర్భవతి అని తేల్చేశారు. ఆ వార్త వినగానే ఆమె షాకైంది. అయితే ఆ షాక్ నుంచి తేరుకునేలోపే కైలా పండంటి పాపకు జన్మనిచ్చింది. గత ఏడాది నవంబర్‌లో ఘటన చోటు చేసుకోగా.. తాజాగా కైలా సోషల్ మీడియా వేదికగా తనకు ఎదుర్కొన్న విచిత్ర అనుభూతిని నెటిజన్లతో పంచుకుంది. గర్భం తాలూకు శరీర మార్పులు తనలో కలగలేదని చెప్పుకొచ్చింది. ఎప్పటిలాగే సన్నగా ఉన్నానని.. అయినా తన గర్భంలో శిశువు పెరగడంతో ఆశ్చర్యానికి లోనైనట్టు తెలిపింది. అంతేకాదు ప్రతినెలా పీరియడ్స్ కూడా వచ్చినట్టు చెప్పింది. పుట్టిన పాపకు మది(Madi) అని పేరు పెట్టినట్టు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మది తండ్రి తనతో లేడని వెల్లడించింది. క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ (cryptic pregnancy) కారణంగా తన విషయంలో ఇలా జరిగినట్టు వివరించింది.

క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ..

webmd.com ప్రకారం.. క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ వస్తే గర్భం దాల్చిన విషయం కూడా సదరు మహిళలకు తెలియదట. చాలా తక్కువ మంది మహిళల్లో.. చాలా అరుదుగా ఇటువంటి ప్రెగ్నెన్సీ సంభవిస్తుందట.

Updated Date - 2022-11-05T15:07:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising