ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇల్లు అద్దెకు ఇస్తున్నారా జాగ్రత్త.. ఓ ఇంటి ఓనర్ కు ఎదురైన పరిస్థితి గురించి తెలిస్తే...

ABN, First Publish Date - 2022-12-08T14:24:58+05:30

ఓనరు సంతోషించేలోపే అతనికి షాక్ తగిలింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓ ఇంటి ఓనర్ తన ఇంటిని ఓ మహిళకు అద్దెకు ఇచ్చాడు. అయితే రావలసిన ఇంటి అద్దె గురించి ఆమెను ప్రతి నెలా అడగుతూనే ఉన్నాడు. అతను ఎంత ప్రయత్నం చేసినా ఆమె ఇంటి అద్దె ఇవ్వడం లేదు ఇక విసిగిపోయి అతను కోర్టు మెట్లెక్కాడు. కోర్టువారు ఇంటిని కాళీ చెయ్యమంటూ సదరు మహిళకు నోటీసులు పంపించారు. హమ్మయ్య దరిద్రం వదిలిపోతుంది అని ఆ ఓనరు సంతోషించేలోపే అతనికి షాక్ తగిలింది. ఇంతకూ ఏం జరిగిందంటే..

జోర్ధైన్ లిడిల్ అనే మహిళ ఉత్తర కొరియాలో సాల్పోర్డ్ అనే ప్రాంతంలో నివసిస్తోంది. ఆమె ఉన్నది అద్దె ఇల్లు. అయితే ఆమె ఆ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం లేదట. చెత్తను ఎక్కడంటే అక్కడ వేసి ఇంటిని చాలా గలీజ్ చేస్తోందట. దానికి తోడు ఇంటి అద్దె కూడా చెల్లించడం లేదట. దీంతో సదరు ఇంటి ఓనరు కోర్టును ఆశ్రయించారు. యజమాని వాదనలు విన్న కోర్టు వారు వెంటనే ఆమెను ఇంటిని ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు. ఇలా యజమాని తనపై కోర్టుకెక్కడం, న్యాయస్థానం నోటీసులు ఇవ్వడంతో లిడిల్ కు కోపం వచ్చింది. ఫుల్లుగా మద్యం సేవించి రాత్రి సమయంలో సిగరెట్ లైటర్ తో ఇంటికి నిప్పుపెట్టి తనకేమీ తెలియనట్టు అక్కడి నుండి స్నేహితుల దగ్గరకు వెళ్ళిపోయింది. ఆ తరువాత మద్య మద్యలో ఇంటికి దగ్గరకు తిరిగి వచ్చి ఇల్లు కాలిపోయిందా లేదా అని చెక్ చేసుకుంది కూడా. జరిగిన సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి విచారణ చేశారు. వారు లిడిల్ ను ప్రశ్నించగా తనకు ఏమీ తెలియదని ఇల్లు కాలిపోతుంటే తాను అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశానని బుకాయించింది.

జరిగిన సంఘటన గురించి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఆ ఇంటిబయట కరెంట్ స్తంబానికి అమర్చిన సిసిటివి పుటేజ్ లభ్యమయ్యింది. అందులో చూడగా లిడిల్ అక్కడికి వచ్చి తన సిగరెట్ లైటర్ తో ఇంటికి నిప్పుపెట్టడం, అది కాలిపోతుందా లేదా అని మధ్యమధ్యలో వచ్చి చెక్ చేయడం పోలీసులకు కనిపించింది. ఇంటికి చాలా నష్టం వాటిల్లిందని విచారణలో తేలింది. దాని ఆధారంగా పోలీసులు ఆమెను అరెస్ట్ చేసారు. ఈమెను విచారణ మొత్తం విన్న కోర్టువారు ఈమెకు 3సంవత్సరాలా 10నెలల జైలు శిక్ష వేసారు.

Updated Date - 2022-12-08T14:25:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising