Arjun : విశ్వక్సేన్ నిబద్ధత లేని నటుడు.. ఏం జరిగిందంటే..
ABN, First Publish Date - 2022-11-05T18:27:25+05:30
నిబద్ధత అంటే అది... అలా చేయడం నా పరపతికి దెబ్బ తగిలినట్లే.. ఇక ఈ సినిమా చేయాలనుకోవడం లేదు.. బయటకు చెప్పుకోని నిర్మాతలు చాలామంది ఉన్నారు.. నా ధైర్యం ఉంది... బయటకు వచ్చా.. పద్థతులు తెలియకపోతే, సినిమాలు చేయకండి!!
నిబద్ధత అంటే అది... (Arjun sarja)
అలా చేయడం నా పరపతికి దెబ్బ తగిలినట్లే..
ఇక ఈ సినిమా చేయాలనుకోవడం లేదు..
బయటకు చెప్పుకోని నిర్మాతలు చాలామంది ఉన్నారు..
నా ధైర్యం ఉంది... బయటకు వచ్చా..
పద్థతులు తెలియకపోతే, సినిమాలు చేయకండి!!
-అర్జున్ సర్జా
‘‘ఈ సినిమా ఓపెనింగ్‌కు బాలకృష్ణగారిని అతిథిగా పిలిచా. అదే రోజు అనుకుని ‘అడ్రస్ పెట్టు వస్తా అన్నారు. పది రోజుల తర్వాత అని చెప్పడంతో, ‘సారీ బాస్ నేను చేస్తున్న సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్ని అడిగి చెబుతా’ అన్నారు. అది నిబద్థత అంటే! వెంకటేశ్, చిరంజీవి ఇలా అందరూ తమ ప్రొడ్యూసర్స్‌ని అడిగి వస్తామని చెప్పారు. అది కమిట్మెంట్. నేను అల్లు అర్జున్‌తో కలిసి పనిచేశా. షూటింగ్ అంటే సమయానికి వచ్చేస్తాడు. అంత డబ్బు, పరపతి ఉన్నా, ఇంకా కష్టపడుతూనే ఉంటారు. కానీ, విశ్వక్సేన్ మాత్రం ‘రేపు షూటింగ్ క్యాన్సిల్ చేయండి’ అని మెసేజ్‌లు పెడతాడు’’ అని సీనియర్ నటుడు అర్జున్ సర్జా ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వక్సేన్ (vishwak sen) నిబద్ధత లేని నటుడు అని మండిపడ్డారు. ఇండస్ట్రీ పద్ధతులు తెలియకపోతే ఎవరి ఇంట్లో వాళ్లు కూర్చుందాం. ఇలా షూటింగ్‌లకు క్యాన్సిల్ చెప్పి దర్శకనిర్మాతలను ఇబ్బందులకు గురి చేయవద్దు’’ అని ఆయన అన్నారు. విశ్వక్సేన్ హీరోగా అర్జున్ తన కుమార్తె ఐశ్వర్యాను టాలీవుడ్‌కి పరిచయం చేస్తూ ఓ సినిమా ప్రారంభించారు. ఆ సినిమా విశ్వక్ చేసిన ఆగడాలను అర్జున్ మీడియా ముందుపెట్టారు. (vishwak sen issue)
‘‘సినిమా ఇండస్ట్రీలో 40 ఏళ్ల అనుభవం నాది. ఇప్పటి వరకూ ప్రెస్‌మీట్ పెట్టి ఇలా మాట్లాడలేదు. నటుడిగా, రచయితగా, దర్శకనిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా సక్సెస్ఫుల్ జర్నీ నాది. ఓ మంచి కథతో మా అమ్మాయిని తెలుగులో పరిచయం చేయాలనుకున్నా. ఇప్పటి వరకూ నేను రాసిన కథల్లో ఇది బెస్ట్ అని చెబుతాను. ఈ కథకు హీరో ఎవరు అనుకున్నప్పుడు విశ్వక్సేన్ నా మదిలో మెదిలారు. ఆయనకు సీన్ టు సీన్ వివరించా. అంతా ఓకే అయింది. పారితోషికం విషయం వచ్చేసరికి ఆయన మేనేజర్ చెప్పింది నాకు వర్కవుట్ కాలేదు. ఎలాగా అని ఆలోచిస్తుంటే ఆయనే ఓ ఏరియా సినిమా నేను తీసుకుంటాను అన్నారు. అందుకు అంగీకరించా. అడ్వాన్స్ కూడా ఇచ్చాను. అంతా కామ్ అయిపోయింది. అక్కడి నుంచి ఎన్నిసార్లు కథా చర్చలని పిలిచినా విశ్వక్ కాల్ కూడా తీయలేదు. ఇన్నేళ్ల నా అనుభవంలో ఎవరికీ నేను అన్ని సార్లు ఫోన్స్ చేసి ఉండను. దానిని కూడా నేను తప్పుగా అనుకోలేదు. తను హీరోగా, దర్శకనిర్మాతగా చాలా బిజీగా ఉన్నాడని అర్ధం చేసుకున్నా. కాస్ట్యూమ్ డిజైనర్‌ని పంపినా అతను టైమ్ ఇవ్వలేదు. తర్వాత నేనే మాట్లాడి 30 రోజులు షెడ్యూల్ గురించి చెప్పా. సరేనని.. మళ్లీ కొంచెం సమయం కావాలి. ‘ఫారిన్ నుంచి వచ్చా.. ట్యాన్ అయ్యా, ఫిజిక్ ఛేంజ్ చేయాలి. ఫ్రెష్‌గా వస్తానని’ చెప్పడంతో నేను కూడా ఓకే అన్నా. అప్పటికే నేను జగపతిబాబు, కేరళలో కొందరి ఆర్టిస్ట్‌ల డేట్స్ ఫిక్స్ చేసుకున్నా. మూడు రోజులు అన్న అతను ఎంటైర్ షెడ్యూల్‌కి రాలేదు. జగపతిబాబు డేట్స్ వృధా చేయకూడదని ఆయనతో కొన్ని సన్నివేశాలే తీశా. ఆ తర్వాత వారానికి మళ్లీ సిట్టింగ్ జరిగింది. ఈ నెల మూడో తేదీ నుంచి డిసెంబర్ పదో తేదీ వరకూ ఏ పనీ పెట్టుకోవడం లేదు. మీకే చేస్తానని చెప్పి.. మళ్లీ వారం గ్యాప్ కావాలన్నారు. దానికి కూడా అడ్జస్ట్ అయ్యా. తదుపరి మీటింగ్‌లో హీరో పేరు మార్చుదామా అని అడగగానే విశ్వక్ కొన్ని పేరు సజెస్ట్ చేశాడు. తాజా షెడ్యూల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణకు రావాలని అడగగా హెయిర్ డ్రెస్సింగ్ ఫొటోలన్నీ పంపి రేపటి నుంచి మనదే చేద్దాం అని చెప్పి... షూట్‌కి అంతా రెడీ చేసుకొని ఆరు గంటలకు షూటింగ్‌కు రమ్మంటే ఉదయం 5 గంటలకు నాకు విశ్వక్ నుంచి మెసేజ్ వచ్చింది. ‘సర్ ఐయామ్ సారీ ప్లీజ్ క్యాన్సిల్ షూట్’ అని చూసే సరికి, ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. ఏ మాట్లాడాలో కూడా తెలియలేదు. కథ, క్యారెక్టర్, డైలాగ్‌లో ఎలాంటి మార్పూ లేదు. ఎందుకు ఇలా చేస్తున్నాడనిపించింది. అది చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యా. డే అండ్ నైట్ కష్టపడి సెట్ సిద్థం చేసిన తర్వాత షూటింగ్ క్యాన్సిల్ అనడం ఎంతవరకు కరెక్ట్ అని అర్జున్ ప్రశ్నించారు. మరీ ఇంత అన్‌ప్రొఫెషనలిజమా. ఇది సాంకేతిక నిపుణులను అవమానించడమే! ఆ తర్వాత ఆయన మేనేజర్ ‘సర్ మీతో తర్వాత మాట్లాడతా’ అని మెసేజ్ పెట్టారు. దర్శక నిర్మాత అంటే ఆయనకి మర్యాద లేదా? ఈ హీరోను పెట్టుకుని పెద్ద సినిమా చేద్దామని, బాగా డబ్బులు సంపాదించాలని అనుకోలేదు. మంచి సినిమా చేయాలనుకున్నా. ఇండస్ర్టీ అంటే ఎంతో నిబద్థత కలిగిన నటులు చాలా మందిని చూశా. జగపతిబాబు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. ఆయన్ని డేట్స్ అడిగాను. ఆయన షెడ్యూల్ నాకు చూపించారు. అది పూర్తయిన తర్వాత రెండు నెలలు ఏ సినిమా షూటింగ్ లేదని చెప్పారు.. ‘నా కోసం మధ్యలో రెండు రోజులు సర్దుబాటు చెయ్’ అని అడిగితే ‘అస్సలు కుదరదు. నేను వాళ్లకు కమిట్మెంట్ ఇచ్చాను’ అన్నారు. నటుడికి ఆ నిబద్థత ఉండాలి. ఈ సినిమా ఓపెనింగ్‌కు బాలకృష్ణగారిని అతిథిగా పిలిచా. అదే రోజు అనుకుని ‘అడ్రస్ పెట్టు వస్తా అన్నారు. పది రోజుల తర్వాత అని చెప్పడంతో, ‘సారీ బాస్ నేను చేస్తున్న సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్ని అడిగి చెబుతా’ అన్నారు. అది నిబద్థత అంటే! సినిమా పూజా కార్యక్రమం రోజున కూడా ఆల్ ది బెస్ట్ చెప్పి, రాలేకపోయినందుకు సారీ చెప్పారు. వెంకటేశ్, చిరంజీవి ఇలా అందరూ తమ ప్రొడ్యూసర్స్‌ని అడిగి వస్తామని చెప్పారు. అది కమిట్మెంట్. నేను అల్లు అర్జున్‌తో కలిసి పనిచేశా. షూటింగ్ అంటే సమయానికి వచ్చేస్తాడు. అంత డబ్బు, పరపతి ఉన్నా, ఇంకా కష్టపడుతూనే ఉంటారు . కానీ, విశ్వక్సేన్ మాత్రం ‘రేపు షూటింగ్ క్యాన్సిల్ చేయండి’ అని మెసేజ్‌లు పెడతాడు, ఒక రోజు షూటింగ్ అంటే ఎంతమంది కష్టం ఉంటుందో తెలుసు కదా? షూటింగ్ చేయాల్సిన సమయంలో ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడాల్సిన పరిస్థితి తెచ్చారు. నేను ఆయన గురించి చెడుగా చెప్పాలని కాదు. నా ప్రాజెక్ట్ నుంచి బయటకు వెళ్లడం అంటే, నా పరపతికి దెబ్బ తగిలినట్లే. నా సినిమా నుంచి ఎవరూ బయటకు వెళ్లకూడదని నేను అనుకున్నా. ఇలాంటి పరిస్థితుల్లో నేను సినిమా చేయదలచుకోవడం లేదు. ఈ విషయం చెప్పడానికే ప్రెస్‌మీట్ పెట్టా. కొన్ని రోజులు తర్వాత కాంప్రమైజ్ అయినా, ఈ సినిమా చేయను. రచయిత సాయి మాధవ్ బుర్రా మాటలు, చంద్రబోస్ సాహిత్యం, అనూప్ సంగీతం అతనికి నచ్చడం లేదు. నటుడిగా అతడు కొన్ని సూచనలు చేయడంలో తప్పులేదు. కానీ, మేకర్‌గా నాకు నచ్చాలి కదా! చాలా సార్టు సర్ది చెప్పా. వినలేదు. ఇలాంటివి అందరికీ తెలియాలి. బయటకు మాట్లాడలేని నిర్మాతలు చాలా మంది ఉంటారు. నాకు ధైౖర్యం, శక్తి ఉన్నాయి. అందుకే ఇలా చెబుతున్నా. దర్శక నిర్మాత అన్న వ్యక్తి మర్యాద ఇవ్వాలి. నచ్చనపోతే ‘ఈ సినిమా చేయాల్సిందే’ అని ఎవరూ బలవంతం చేయరు. ఇండస్ర్టీలో పద్థతులు తెలియకపోతే, సినిమాలు చేయకండి. ఎవరి ఇంట్లో వాళ్లు ఉందాం. ఇలా ఇబ్బందలకు గురి చేయవద్దు’’ అని అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు.
Updated Date - 2022-11-05T18:27:27+05:30 IST