ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్కడ ఒక్క బంగారం షాపు కూడా లేదు.. ఎవరైనా పెట్టినా 3 రోజుల్లో బంగారం నల్లగా మారిపోతుందట!

ABN, First Publish Date - 2022-12-09T15:25:45+05:30

బంగారం దుకాణం పెట్టాలని ప్రయత్నించి.. ఇలా నష్టపోయినవాళ్ళు ఎందరో ఉన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓ వ్యక్తి బంగారు దుకాణం తెరిచాడు ఆ ఊళ్ళో. అయితే మూడు రోజులు గడవగానే బంగారం కాస్తా నల్లగా మారిపోయింది. అతడి ఇంట్లో కూడా ఎన్నో సమస్యలు చోటుచేసుకున్నాయి. అతడు పూర్తిగా నష్టపోయాడు. ఆ ఊళ్ళో బంగారం దుకాణం పెట్టాలని ప్రయత్నించి.. ఇలా నష్టపోయినవాళ్ళు ఎందరో ఉన్నారు. ఈ క్రమంలో అక్కడ బంగారం దుకాణాలు పెట్టకూడదనేది దేవుడి నిర్ణయమని స్థానికులు నమ్ముతున్నారు. వినడానికి వింతగా అనిపించినా ఇది నిజం. ఈ క్రమంలో.. ఇంతకూ ఆ ఊరు ఎక్కుండుంది. అక్కడి ప్రజల నమ్మకం ఏంటి వంటి వివరాల్లోకి వెళితే..

చండీఘర్ నుండి 11 గంటల ప్రయాణం చేస్తే బైజ్‌నాథ్ వస్తుంది. పరమశివుడు వెలసిన ఆ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి కాకపోయినా ఎంతో అద్భుతమైన క్షేత్రమది. ఇక్కడ బంగారం దుకాణాలు ఎవరు వెట్టినా మూడురోజులకే ఆ బంగారం కాస్తా నల్లగా శివలింగం రంగులోకి మారిపోతుందట. ఇక్కడ ఈ నమ్మకం కొన్ని దశాబ్దాల నుంచి కొనసాగుతోంది.

ఎందుకు ఈ నమ్మకం అంటే...

పరమేశ్వరుడు తన గొప్ప భక్తుడు అయిన రావణుడికి బంగారు లంకను ప్రసాదించాడట. ఆ కారణం వల్ల ఆ ప్రాంతంలో బంగారు దుకాణాలు ఎవరు పెట్టినా అందులో బంగారం అంతా నల్లగా శివలింగం రంగులోకి మారిపోతుందట.

రావణుడి కథలు..

సాధారణంగా అన్ని చోట్లా రాముడు ఉత్తముడు రామ ధర్మం గొప్పది అంటూ పిల్లలకు కథలు చెబుతారు. అయితే ఈ ప్రాంతంలో మాత్రం పిల్లలకు తమ పెద్దలు రావణుడి కథలు చెబుతారు. రావణుడి శివభక్తి చాలా గొప్పదని, ఆయన గొప్ప విద్యావంతుడని అందుకే ఆయన గురించి తమ పిల్లలకు కథలుగా చెబుతామని వారు సమాధానం ఇస్తున్నారు.

దసరా అసలు జరుపుకోరు

ఆ ప్రాంతంలో దసరా పండుగ అసలు జరుపుకోరు. రావణుడి దహనం జరిగే వేడుకలకువారు ఎప్పుడూ దూరంగా ఉంటారు. ఒకవేళ ఎవరైనా అలా జరుపుకొంటే వారికి మరణం తప్పదని అక్కడి వాళ్లు నమ్ముతున్నారు. దసరా జరుపుకొన్న కొందరు మరణించారని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ కారణాల వల్ల ఆ ప్రాంతంలో దసరా పండుగ అనేది జరుపుకోవడం లేదట.

రావణుడికి ఎంతో గౌరవం, మర్యాద ఇచ్చే ఈ ప్రాంత వాసులకు రాముడి మీద ఎలాంటి వ్యతిరేక భావం లేదట. కానీ వారికి రావణుడే ముఖ్యమైనవాడనే విషయం వారి సంప్రదాయాలలో వారి మాటల్లో స్పష్టమవుతోంది.

Updated Date - 2022-12-09T15:25:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising