Biggboss 6: అప్పుడు హగ్గులు.. ముద్దులు.. ఇప్పుడు ఊహలు!
ABN, First Publish Date - 2022-11-05T16:53:43+05:30
బిగ్‌బాస్ సీజన్ 6లో ఆర్జే సూర్య రెండు ట్రాక్‌లు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిపోయాడు. మొదట తన స్నేహితురాలు ఆరోహితో సన్నిహితంగా ఉండడం, హగ్గులు, ముద్దులు పెట్టుకోవడంతో అందరూ వారిద్దరి మధ్య ఏదో ఉందనుకున్నారు.
బిగ్‌బాస్ సీజన్ 6(Biggboss 6)లో ఆర్జే సూర్య రెండు ట్రాక్‌లు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిపోయాడు. మొదట తన స్నేహితురాలు ఆరోహితో సన్నిహితంగా ఉండడం, హగ్గులు, ముద్దులు పెట్టుకోవడంతో అందరూ వారిద్దరి మధ్య ఏదో ఉందనుకున్నారు. ఆరోహి (Arohi)ఎలిమినేట్ కావడంతో సూర్య ట్రాక్ ఇనాయా (Inaya sultana) మీద పడింది. ఇద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్ ఏర్పడింది. హౌస్‌లో ఏ చిన్న ఇష్యూ జరిగినా ఇద్దరి హౌస్‌లో ఏదో ఒక మూలకు వెళ్లి ఓదార్పు మొదలుపెట్టడం, హగ్ చేసుకుంటూ ఓదార్చుకోవడం లాంటివి చేసేవారు. ఇనాయా ఎలిమినేషన్ కన్‌ఫామ్ కాకముందే.. సూర్య ఆమె గురించి తెగ బాధపడిపోయాడు. నాకు ఇష్టమైన వాళ్లంతా ఇలాగే దూరమవుతారు అంటూ రోదన మొదలుపెట్టాడు. కానీ ఊహించని విధంగా ఇనాయ కంటే తానే ముందు ఎలిమినేట్ అయ్యాడు. ఇనాయా మాత్రం ఇంట్లోనే ఉంది. ఇప్పుడామె వంతు వచ్చింది. ఇంట్లో సూర్యని తలుచుకుంటూ తెగ బాధపడిపోతోంది. అతను బయటకు వెళ్లిపోయినా ఈమె వదలట్లేదు. 56వ రోజు ఎపిసోడ్ ఓ రూమ్‌లోకి వెళ్లి తలుపులు వేసేసుకుని ఏడుపు మొదలుపెట్టిన ఆమె ‘తనకు ఇష్టమైన వారు ఎవరూ దగ్గరగా ఉండరనీ, దూరమైపోతారని, సూర్య కూడా ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయాడని, తన వల్లే అదంతా జరిగిందనే గిల్డ్ ఉందని, హౌస్ ఉండడం ఇష్టం లేదని బిగ్‌బాస్‌కు చెప్పింది. బిగ్‌బాస్ ఆమె కన్‌పెషన్ రూమ్‌కి పిలిచి కొన్ని మాటలు చెప్పగా ఆమె కన్విన్స్ అయ్యి మళ్లీ ఆట కొనసాగించింది.
తాజా ఎపిసోడ్‌లో శ్రీహాన్, శ్రీసత్యలను కలిపి కామెంట్ చేసింది. దాంతో శ్రీహాన్ చెలరేగిపోయాడు. ఆ ఇష్యూ క్యారెక్టర్‌లను దూషించుకునే వరకూ వెళ్లింది. శ్రీహాన్ కింద శ్రీసత్య పడుకుందని కామెంట్ చేయడంతో శ్రీహాన్ ఆమెపై మండిపడ్డాడు. మాకు ఓ క్లారిటీ, మా ఫ్రెండ్‌షిప్‌కు ఓ పేరు ఉందని చెప్పాడు. అంతగా గొడవ పెద్దది కాగా ‘నేను అలా అనలేదు. సోఫాలో పడుకున్నారు అంటూ మాట మార్చేసింది. ఆ గొడవ సర్దుమణిగాక ఇనాయా ఇప్పుడు ఇంట్లో లేని ఆర్జే సూర్య గురించి కలలు కంటుంది. ఊహల్లో విహరిస్తుంది. బెడ్‌పై పడుకుని ‘ఎందుకు సూర్య నీ గురించి ఇంతగా ఆలోచిస్తున్నాను. నాకే అర్థం కావట్లేదు. ఏ గేమ్ ఆడినా నువ్వు పక్కనే ఉన్నట్లు ఉంది. నా జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి. ఈరోజు గేమ్ అంతా నిన్ను గుర్తు తెచ్చుకునే ఆడారా! ఎవరు ఎన్ని అన్నా.. అవన్నీ బరించి ఆడాను సూర్య. ఇనాయా ఆడితేఏ ఎలా ఉంటుందో చూపించమన్నావ్ కదా? చూపించాను రా’ అంటూ తనలో తానే మాట్లాడుకుంది. మరి దీనికి బయటున్న సూర్య ఎలా స్పందిస్తాడో చూడాలి.
Updated Date - 2022-11-05T16:53:44+05:30 IST