ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

USA: ఈ కంపెనీ ఎంత పని చేసిందో చూడండి..అర్ధరాత్రి 2700 మంది ఉద్యోగులను..

ABN, First Publish Date - 2022-11-28T21:20:48+05:30

అర్ధరాత్రి చెప్పాపెట్టకుండా ఒకేసారి 2700 మంది ఉద్యోగులను తొలగించిన అమెరకా కంపెనీ.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: మాంద్యం ముంచుకొస్తోందన్న భయాల నడుమ కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్న తీరు కలకలానికి దారితీస్తోంది. అమెరికాకు(USA) చెందిన ఓ ఫర్నీచర్ కంపెనీ ఇటీవల అర్ధరాత్రి ఉద్యోగులను తొలగించింది. మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నామంటూ ఏకంగా 2,700 మంది ఉద్యోగులకు సందేశాలు పంపించింది. మిసిసిప్పీలోని(Mississippi) యూనైటెడ్ ఫర్నీచర్ ఇండస్ట్రీస్(United Furniture Industries) సంస్థ నవంబర్ 21న ఇలాంటి షాకింగ్ చర్యకు పూనుకుంది.

‘‘బోర్డు డైరెక్టర్ల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఊహించిన పరిస్థితుల కారణంగా మిమ్మల్ని తొలగించాల్సి వచ్చినందుకు చింతిస్తున్నాం.’’ అని ఉద్యోగులకు సందేశాలు వెళ్లాయి. ‘‘ఇవన్నీ శాశ్వత ప్రాతిపదికన చేపట్టిన తొలగింపులు. కంపెనీ తరపున ఇన్సూరెన్స్ సహా మీకందిన బెనిఫిట్స్ అన్నీ తక్షణం నిలిపేస్తున్నాం.’’ అంటూ మరో ఈమెయిల్‌లో సంస్థ తన ఉద్యోగులకు ఊహించని షాకిచ్చింది. కంపెనీకి సంబంధిన పరికరాలు తమ వద్ద పెట్టుకున్న ఉద్యోగులు వాటిని వెంటనే తిరిగిచ్చేయాలని సూచించింది. అయితే.. ఈ తొలగింపుల పర్వానికి కారణమేంటో స్పష్టంగా చెప్పలేదు.

మరో రెండు రోజుల్లో థ్యాంక్స్ గివింగ్(Thanksgiving) వేడుక ఉందనంగా సంస్థ తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులు భారీ షాక్‌కు లోనయ్యారు. కంపెనీ కోసం ఇన్నాళ్లుగా నిబద్ధతతో పనిచేస్తున్న వారిని ఇలా చెప్పాపెట్టకుండా తొలగించడం అన్యాయమని మండిపడ్డారు. ‘‘చికిత్స తీసుకుంటున్న ఓ క్యాన్సర్ బాధితుడికి నీ ఇన్సూరెన్స్ ఆగిపోయిందని చెప్పడం..ఇటీవలే తల్లైన ఓ మహిళలకు బిడ్డను కాపాడుకునే బీమా సౌకర్యం లేదనడం నిజంగా అన్యాయం’’ అని కామెంట్స్ చేశారు. ఇలా అకస్మాత్తుగా ఉద్యోగం కోల్పోయిన ఓ మాజీ ఉద్యోగి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. చట్టప్రకారం ఉద్యోగిని తొలగించే ముందు ఇవ్వాల్సిన 60 రోజుల నోటీసు సంస్థ తమకు ఇవ్వలేదంటూ కోర్టులో కేసు దాఖలు చేశాడు. ఈ ఉదంతం ప్రస్తుతం స్థానికంగా సంచలనంగా మారింది.

Updated Date - 2022-11-28T21:21:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising