ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఈ ఫొటోలోని అమ్మాయి వయసు ఎంతో ఊహించగలరా..? అసలు నిజం తెలిస్తే నివ్వెరపోవడం ఖాయం..!

ABN, First Publish Date - 2022-05-15T01:24:35+05:30

వయసు ఎంత పెరిగినా కొందరు చూడటానికి మాత్రం చిన్నవారిలా కనిపిస్తుంటారు. అలాంటి వారిని చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఇంకొందరిలో మాత్రం కొన్ని రకాల..

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

వయసు ఎంత పెరిగినా కొందరు చూడటానికి మాత్రం చిన్నవారిలా కనిపిస్తుంటారు. అలాంటి వారిని చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఇంకొందరిలో మాత్రం కొన్ని రకాల వ్యాధుల కారణంగా పెరుగుదల మధ్యలోనే ఆగిపోతుంటుంది. చూడటానికి చిన్నపిల్లల మాదిరి కనిపించినా.. వయసు మాత్రం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇలాంటి వారు నిత్యం వివిధ రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటుంటారు. ఇప్పుడు మనం చూస్తున్న ఫొటోలోని అమ్మాయి కూడా చూడటానికి చిన్నపిల్లలా కనిపిస్తున్నా.. వయసులో మాత్రం చాలా తేడా ఉంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..


మహారాష్ట్ర నాగ్‌పూర్‌కు చెందిన అబోలి.. చిన్నతనంలోనే మూత్రపిండం, ఎముకలకు సంబంధించిన వ్యాధికి గురైంది. దీంతో మూడు అడుగుల నాలుగు ఇంచుల వరకు మాత్రమే పెరిగింది. ప్రస్తుతం ఆమె వయసు 19ఏళ్లు. అయినా చూడటానికి చిన్నపిల్లలా కనపడుతోంది. అయితే మరోవైపు రోజూ ఆమె వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటోంది. పుట్టుకతోనే మూత్రాశయం లేకుండా జన్మించడంతో నిత్యం డైపర్ వాడాల్సిన పరిస్థితి. శరీరంలో మూత్రం పేరుకుపోకుండా ఉండేందుకు.. వైద్యులు ఆమె నడుము వద్ద రంధ్రం చేయాల్సి వచ్చింది. నడవడం కూడా కష్టతరమవడంతో వీల్‌చైర్‌‌కి పరిమితమైంది. రోజూ వివిధ సమస్యలతో పోరాటం చేయడంతో పాటూ.. ఆన్‌లైన్‌లో తన వైకల్యాన్ని ఎగతాళి చేసే వారితో కూడా పోరాటం చేయాల్సి వస్తోందని అబోలి చెబుతోంది. ఈమె పరిస్థితి తెలుసుకున్న కొందరు మాత్రం.. అయ్యో పాపం.. అంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

ఫొటోను చూసే అవాక్కవుతున్నారా..? ఈ King Cobra వీడియోను చూస్తే..

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!