ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mouth taping for sleep: వైద్యుల్లో టెన్షన్.. ఇది అస్సలు చేయొద్దంటూ వార్నింగ్!

ABN, First Publish Date - 2022-10-28T16:53:42+05:30

బాగా నిద్రపట్టేందుకు నోటికి టేపు అంటించుకుంటున్న నెటిజన్స్. ఇలా చేయొద్దంటూ వైద్యుల హెచ్చరికలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో రోజుకో కొత్త ట్రెండ్(social Trend) పుట్టుకురావడం.. చూస్తుండగానే ప్రపంచవ్యాప్తంగా వైరల్(Viral) అవడం కామన్. కానీ.. అలాంటి ఓ ట్రెండ్ ప్రస్తుతం వైద్యులనే కంగారు పెడుతోంది. ఇలా అస్సలు ప్రయత్నించవద్దంటూ సోషల్ మీడియాలో కొందరు వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. డాక్టర్లను ఇంతగా కంగారు పెడుతున్న దీని పేరు మౌత్ టేపింగ్(Mouth taping).. తెలుగులో చెప్పుకోవాలంటే.. నోటికి టేపు అంటించడం.. ఎందుకూ అంటే.. నిద్ర(sleep) బాగా పట్టడానికి అట.

వేల మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు(Influencers) ఇప్పటికే ఇలా నోటికి టేపు పెట్టుకున్న వీడియోలను చేశారు. ఇలా చేశాక తెగ నిద్రపట్టేసిందని, తెల్లారాక బాగా ఫ్రెష్‌గా ఫీలయ్యామని చెప్పుకొచ్చారు. వృద్ధాప్యపు ఛాయలు దరిచేరకుండా ఉండాలంటే ఇది మంచి ఉపాయమని కూడా ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. ఇలాంటి వీడియోలకు కోట్లల్లో వ్యూస్ వచ్చాయి. సాధారణంగా రాత్రిళ్లు నిద్రలో ఉండగా ఒక్కోసారి నోటితో శ్వాస తీసుకోవాల్సి వస్తుంది. ఇది అసంకల్పితంగా జరిగే ప్రక్రయ. దీని వల్ల గురక(Snoring) మొదలవుతుంది.. చివరకు నోరు తడి ఆరిపోయి అకస్మాత్తుగా మెళకువ వచ్చి నిద్ర చెదిరిపోతుంది. దీంతో.. శరీరానికి కావాల్సినంత నిద్ర దొరక్క మరుసటి రోజంతా అలసటగానే అనిపిస్తుంది. ఇక గురక వల్ల పక్కవారికీ ఇబ్బందే. ఇన్ని సమస్యలకు కారణం.. నోటితో గాలి పీల్చడం! దీనికి పరిష్కారం.. పెదవులకు గట్టిగా టేపు అందించడం. ఇదీ ఈ ట్రెండ్ వెనకున్న చరిత్ర..!

ఇదీ చదవండి: ఐవీఎఫ్ చికిత్స.. అండాలు సేకరిస్తుండగా మహిళ అనూహ్య మరణం

ఇక ఈ ట్రెండ్‌కు ఆకర్షితులవుతున్న అనేక మంది.. నోటికి ప్లాస్టర్ వేసుకుని వీడియోలు చేస్తున్నారు. ఇలాంటి వీడియోల సంఖ్య ఇటీవల బాగా పెరిగిపోతుండటంతో వైద్యులు అలర్ట్ అయ్యారు. స్లీప్ ఆప్నియా(Sleep Apnea) ఉన్న వాళ్లు దీన్ని ట్రై చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నారు. స్లీప్ ఆప్నియా ఉన్నవాళ్లు.. రాత్రిళ్లు అప్పుడప్పుడూ కొన్ని క్షణాల పాటు ఊపిరి తీసుకోవడం ఆపేస్తారు. ఈ సమస్యతో బాధపడేవారు మౌత్ టేపింగ్‌ పద్ధతిని ప్రయత్నిస్తే.. చిక్కులు కొని తెచ్చుకున్నట్టే అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి.. ఈ రుగ్మత ఉందో లేదో శాస్త్రీయంగా నిర్ధారించుకున్నాకే ట్రెండ్‌ను ఫాలో అవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.

Updated Date - 2022-10-28T17:17:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising