Viral News: మహిళకు యాజమాన్యం షాక్.. ప్రెగ్నెంట్ అని చెబితే జాబ్ నుంచి తీసేశారు!
ABN, First Publish Date - 2022-12-31T11:29:43+05:30
మహిళకు ప్రైవేటు సంస్థ షాకిచ్చింది. ప్రెగ్నెంట్ అని తెలిసి ఆమెను జాబ్ నుంచి తీసేసింది. యాజమాన్యం తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా విస్తుపోయిన ఆమె..
ఇంటర్నెట్ డెస్క్: మహిళకు ప్రైవేటు సంస్థ షాకిచ్చింది. ప్రెగ్నెంట్ అని తెలిసి ఆమెను జాబ్ నుంచి తీసేసింది. యాజమాన్యం తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా విస్తుపోయిన ఆమె.. కోర్టును ఆశ్రయించింది. కేసుపై విచారణ జరిపిన కోర్టు కీలక అదేశాలు జారీ చేసింది. దీంతో ప్రస్తుతం ఆ మహిళకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..
బ్రిటన్(Britain)కు చెందిన ఆ మహిళ పేరు చార్లొట్టె లీచ్(Charlotte Leitch). ప్రస్తుతం ఆమె వయసు 34ఏళ్లు. కొన్నేళ్ల క్రితమే ఆమెకు వివాహం జరిగింది. ఈ క్రమంలోనే దాదాపు ఎనిమిదిసార్లు ఆమెకు గర్భస్రావం అయింది. 2021లో ఆమె మరోసారి గర్భం దాల్చింది. దీంతో ఎక్కడ మరోసారి గర్భస్రావం జరగుతుందో అని భయాందోళనలకు లోనయింది. పని చేసే కంపెనీలో తను గర్భం దాల్చిన విషయాన్ని చెప్పింది. ఎనిమిదిసార్లు గర్భస్రావం జరిగిన విషయాన్ని కూడా చెప్పి.. సెలవులు కోరింది. అయితే.. సదరు కంపెనీ ఆమెకు సెలవులు ఇవ్వకపోగా.. ఉద్యోగం నుంచే తీసేసింది. దీంతో ఆమె తీవ్ర ఒత్తిడికి గురైంది. ఈ క్రమంలోనే ఆమెకు మరోసారి గర్భస్రావం జరిగింది.
Viral News: పెళ్లైన మరుసటి రోజే భార్యపై భర్త పోలీస్ కంప్లైంట్.. ఫిర్యాదు ఏంటంటే..!
ఈ నేపథ్యంలో తనకు జరిగిన అన్యాయంపై లీచ్ కోర్టు(Court)ను ఆశ్రయించింది. దీంతో సదరు కంపెనీ స్పందించింది. లీచ్ అసలు లీవ్స్ కోసం అప్లై చేయలేదనీ.. కొత్త కాంట్రాక్ట్ ఒప్పందంపై కూడా ఆమె సంతకం చేయలేదని వాదించింది. అయితే ఈ కేసుపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిన కోర్టు తాజాగా కీలక ఆదేశాలు ఇచ్చింది. నష్టపరిహారంగా 14,885 పౌండ్లను (సుమారు రూ.15లక్షలు) లీచ్‌కు చెల్లించాలంటూ సదరు కంపెనీని ఆదేశించింది.
Updated Date - 2022-12-31T11:34:32+05:30 IST