ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Faria Abdullah: కొంతమంది బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారు.. కానీ పెద్దవారితోనే ఎక్కువగా..

ABN, First Publish Date - 2022-11-13T10:16:47+05:30

తొలి సినిమా ‘జాతిరత్నాలు’తోనే ‘చిట్టి’ గుండెల్ని... గట్టిగా బద్దలు కొట్టేసింది ఫరియా అబ్దుల్లా.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తొలి సినిమా ‘జాతిరత్నాలు’తోనే ‘చిట్టి’ గుండెల్ని... గట్టిగా బద్దలు కొట్టేసింది ఫరియా అబ్దుల్లా (Faria Abdullah). ఆమె పేరు... ఫేసూ చూసి మరో ఉత్తరాది అమ్మాయి అనుకొంటారేమో..? అచ్చమైన హైదరాబాదీ ఫరియా. పుట్టింది, పెరిగింది, చదివింది... భాగ్యనగరంలోనే. కాకపోతే వచ్చే ఐదేళ్లలో ‘పాన్‌ వరల్డ్‌ స్టార్‌’ అయిపోవాలని కలలు కంటోంది. తన గురించీ, తన ఇష్టాల గురించీ ఆమె ఏం చెబుతుందో విందామా?!

సెల్ఫీ వీడియో తీసుకొన్నా..

‘‘జాతి రత్నాలు (Jathi Ratnalu) నాకు కావల్సినదానికంటే ఎక్కువ పేరే తీసుకొచ్చింది. నాకు బాగా గుర్తు. ‘జాతిరత్నాలు’ సినిమా ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో చూడ్డానికి థియేటర్‌కి వెళ్లా. సినిమా ప్రారంభానికి ముందే ఓ సెల్ఫీ తీసుకొన్నా. ‘‘ఈ రోజుతో నా జీవితం ఎలాగైనా మారిపోవచ్చు. ఈ సినిమా నాకు ప్లస్‌ కావొచ్చు.. మైనస్‌ కావొచ్చు. ఏదేమైనా నేను నేనులానే ఉండాలి.. మారిపోకూడదు’ అని నాకు నేను చెప్పుకొన్నా. ఇప్పటికీ ఆ వీడియో నా దగ్గర ఉంది. అందుకే నాలో ఎలాంటి మార్పు రాలేదు.’’

ఏదీ పూర్తి చేయను..

‘‘నా దగ్గర ఓ బ్యాడ్‌ హాబిట్‌ ఉంది. ఏ పనీ పూర్తి చేయను. అన్నీ మధ్యలోనే ఆపేస్తుంటా. ఓ పుస్తకం తీశాననుకోండి. సగం చదివి పక్కన పెట్టేస్తా. మరో పుస్తకం అందుకొంటా. ఏదైనా కొత్త పని నేర్చుకోవాలని మొదలెడితే... అది కూడా సగం వరకే. కానీ మళ్లీ ఎప్పటికో.. తిరిగి పూర్తి చేస్తా. నాకు డాన్స్‌ అంటే పిచ్చి. ప్రతి రోజూ ప్రతి క్షణం డాన్స్‌ చేస్తూనే ఉంటా. ఖాళీగా కూర్చుని ఎవరితోనైనా మాట్లాడుతుంటానా...? మనసులోనే నాలుగు స్టెప్పులు వేసుకొంటా. అలా ఉంటుంది నాతో.’’

ఖాళీగా లేను..

‘‘జాతిరత్నాలు తరవాత ఒకట్రెండు సినిమాల్లో అతిథి పాత్రలు చేశా. మళ్లీ ‘లైక్‌ షేర్‌ సబ్‌స్ర్కైబ్‌’లో నటించా. ఈ రెండు సినిమాలకూ చాలా గ్యాప్‌ ఉంది. అయితే ఆ సమయంలో నేనేం ఖాళీగా లేను. ఎందుకంటే సినిమా కంటే ఇతర వ్యవహారాలు, వ్యాపకాలు నా జీవితంలో ఇంకా చాలా ఉన్నాయి. నేనో క్లాసికల్‌ డాన్సర్‌ని. కొన్ని షోలు చేశాను. వర్క్‌ షాపులు నిర్వహించా. నాకు పెయింటింగ్‌ అంటే ఇష్టం. కవిత్వం రాస్తా. ట్రావెలింగ్‌ చేస్తుంటా. ఇలా... వీటన్నింటి మధ్యలో సినిమాలు కూడా. ‘జాతిరత్నాలు’తో నాకంటూ ఓ గుర్తింపు వచ్చింది. దాన్ని కాపాడు కోవాలంటే ఏది పడితే అది చేయకూడదని ఫిక్సయ్యా. అందుకే ఏ సినిమా ఒప్పుకోలేదు.’’

వాటికి ఫిదా..

‘‘అమితాబ్‌ బచ్చన్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన కళకు, సినిమాకు ఇచ్చే గౌరవం చూస్తే ఆశ్చర్యం వేస్తుంటుంది. జీరోకి వెళ్లిపోయి కూడా ఆయన మళ్లీ హీరో అయ్యారు. ఆ ప్రయాణం ఆదర్శవంతం. ఆయనకు సినిమానే అక్కర్లేద్దు. రేడియో ముందు కుర్చున్న సరే, అందర్నీ కేవలం గొంతుతో తనవైపు తిప్పుకోగలరు. ఐశ్వర్యరాయ్‌ అందం, తబు నటన, సుస్మితాసేన్‌ లుక్స్‌... వీటికి నేను ఫిదా అయిపోతాను.’’

బాయ్‌ఫ్రెండ్స్‌ ఉన్నారు.. కానీ..

‘‘నా మైండ్‌సెట్‌ చాలా విచిత్రంగా ఉంటుంది. ఎవరికీ త్వరగా అర్థం కాను. నాకు చాలామంది ఫ్రెండ్స్‌ ఉన్నారు. నాకంటే వయసులో పెద్దవారితో ఎక్కువ సన్నిహితంగా ఉంటాను. ఎందుకంటే వాళ్ల నుంచి ఎక్కువ విషయాలు నేర్చుకొనే అవకాశం ఉంటుంది. ఇంట్లోవాళ్లు మాత్రం ‘నీ తోటి వాళ్లతో స్నేహం చెయ్‌...’ అంటుంటారు. నేను అవేం పట్టించుకోను. నా దారి నాదే. నేనో సీతాకోక

చిలుక లాంటిదాన్ని. ప్రపంచమంతా స్వేచ్ఛగా తిరగాలనుకొంటా. నాకు కొంతమంది బాయ్‌ఫ్రెండ్స్‌ ఉన్నారు. వాళ్లు కేవలం బాయ్‌ఫ్రెండ్స్‌ మాత్రమే. రిలేషన్‌, పెళ్లి లాంటి విషయాలపై పెద్దగా నమ్మకం లేదు.’’

పుస్తకం రాయాలి..

‘‘నాకు ట్రావెలింగ్‌ అంటే చాలా ఇష్టం. ఒక్కదాన్నే ఎక్కడెక్కడికో వెళ్లిపోతుంటా. అక్కడి ఫుడ్‌, కల్చర్‌ తెలుసుకోవడం ఇష్టం. నా ట్రావెలింగ్‌ అనుభవాలన్నీ ఓ పుస్తకంగా తీసుకురావాలని ఉంది. అలాగే రాబోయే మూడేళ్లలో ‘పాన్‌ వరల్డ్‌ స్టార్‌’ అవ్వాలి. అన్ని భాషల్లోనూ సినిమాలు చేయాలి. దేశాల్ని దాటి ప్రయాణించాలి. పదేళ్ల తరవాత మెగాఫోన్‌ పడతా. కళాత్మక చిత్రాలకు దర్శకత్వం వహిస్తా. పాతికేళ్లయినా ఈ పరిశ్రమలో ఏదో ఓ రంగంలో పని చేస్తూనే ఉంటా.’’

Updated Date - 2022-11-13T10:50:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising