honey trap: బ్లాక్ మెయిల్ చేసి బిజినెస్ మెన్ నుండి 80లక్షలు గుంజిన మహిళా యూట్యూబర్.. ఇంతకీ ఏం జరిగిందంటే..
ABN, First Publish Date - 2022-12-07T14:34:31+05:30
ఆమెకు సుమారు 6లక్షలకుపైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు
హోటల్ గదిలో అతను కళ్ళు తెరిచేసరికి ఒక అమ్మాయి, అబ్బాయి అతన్ని చుట్టుముట్టారు. వాళ్ళు ఇద్దరూ అతనితో 'నీదగ్గరున్న క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్ఢ్, వాటి పాస్వర్డ్, ఇంకా నీతో ఉన్న ఖరీదైన వస్తువులు అన్నీఇచ్చెయ్యి. లేకపోతే ఇదిగో ఈ హోటల్ రూమ్ లో నామీద అత్యాచారం చేసావని పోలీసులకు ఫిర్యాదు చేసి నిన్ను అరెస్ట్ చేయిస్తాను' అని బ్లాక్ మెయిల్ చేసంది ఆ అమ్మాయి. ఆమెతో ఉన్న వ్యక్తి ఆమెకు సహకరించాడు. పోలీసులు, కేసులు అనేసరికి అతడు భయపడిపోయాడు. వాళ్ళు తనను ఎక్కడ తప్పుడు కేసులో ఇరికిస్తారో అని భయపడి వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చేసాడు. హోటల్ కు తీసుకెళ్ళి ఓ బిజినెస్ మెన్ ను హనీ ట్రాప్ చేసిందో మహిళా యూట్యూబర్. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే..
నమ్రా ఖాదిర్ అనే 22సంవత్సరాల మహిళ యూట్యూబ్ ఛానెల్ నడుపుతోంది. అందులో ఆమెకు సుమారు 6లక్షలకుపైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆమె తన ఛానెల్ లో బిజినెస్ ప్రమోషన్స్ చేసేది. ఈ క్రమంలో బిజినెస్ మెన్ దినేష్ ఆమెకు పరిచయమయ్యాడు. వీరిద్దరూ కాలం గడిచేకొద్ది ఎంతో సన్నిహితం అయ్యారు. నమ్రా ఖాదిర్ దినేష్ కు ప్రపోజ్ చేసి పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నట్టు కూడా చెప్పింది. అదంతా నిజమేనని నమ్మిన దినేష్ ఆమెతో చనువుగా ఉండేవాడు. ఒకసారి నమ్రా ఖాదిర్ హోటల్ లో రూమ్ బుక్ చేసి దినేష్ ను అక్కడికి తీసుకెళ్ళింది. ఆరోజు రాత్రి వారు హోటల్ రూమ్ లో గడిపారు. మరుసటి రోజు ఉదయాన్నే దినేష్ కు మెలకువ రాగానే నమ్రా ఖాదిర్, ఆమె భర్త విరాట్ ఇద్దరూ దినేష్ ను చుట్టుముట్టి తాము అడిగినవన్నీ ఇవ్వకపోతే తప్పుడు అత్యాచారం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయిస్తామని బ్లాక్ మెయిల్ చేసారు. భయపడిపోయిన దినేష్ తనదగ్గరున్నవన్నీ వారికి సమర్పించుకున్నాడు. తరువాత వాళ్ళు అక్కడినుండి వెళ్ళిపోగా దినేష్ వెళ్ళి తన తండ్రితో జరిగిన మోసం గురించి వివరంగా చెప్పాడు. దినేష్ తండ్రి పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం చెప్పి ఫిర్యాదు చేసాడు.
పోలీసులు నమ్రా ఖాదిర్ ను అరెస్ట్ చేసారు. ఆమె భర్త, వారికి సహకరించిన మరొక వ్యక్తి ఇద్దరూ ప్రస్తుతం పరారీలో ఉన్నారని వారిని తొందరలోనే వెతికి పట్టుకుంటామని చెప్పారు. దినేష్ నుండి వాళ్ళు దోచుకున్న వస్తువులు, బ్యాంక్ బ్యాలెన్స్ మొదలైనవి అన్నీ కలిపి 80లక్షలు విలువ చేస్తాయని వాటిని తొందరలోనే నమ్రా ఖాదిర్ ఆమె భర్తల నుండి రికవర్ చేసి దినేష్ కు అందిస్తామని తెలిపారు. ఇలాంటి హనీ ట్రాప్ లలో చిక్కుకోకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
Updated Date - 2022-12-07T14:38:15+05:30 IST