ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోడల నుండి టాయిలెట్ దాకా అంతా బంగారమే.. ఇదీ.. ఈ హోటల్ స్పెషాలిటీ..

ABN, First Publish Date - 2022-11-19T12:10:45+05:30

ఫైవ్ స్టార్ హోటల్ లో బస చేయడం కల అని అనుకునేవారు నిరభ్యరంతంగా ఆ కలను ఇక్కడ నెరవేర్చుకోవచ్చు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నీ ఇల్లు బంగారం కానూ.. నా ఒళ్ళు సింగారం కాను అని పాత యన్.టి.ఆర్ పాట ఒకటి ఉంటుంది. బంగారం కు ఉన్న క్రేజ్ ఏంటో ఆ పాటలో రెండు లైన్ లలో తేల్చేశారు. అయితే బంగారం మాత్రం ఇప్పుడు కొండెక్కి కూర్చుంది. ఇప్పుడు బంగారం విషయం ఎందుకూ.. అనే సందేహం వస్తుందా?? నగా నట్రా చూసి మురిసిపోయే వాళ్ళకు బంగారం లాంటి ఇంటి గురించి కాకపోయినా బంగారంతో మెరిసిపోయే హోటల్ గురించి చెప్పాలి.

ఏంటి బంగారంతో చేసిన హోటలా అని ఆశ్చర్యం వేస్తుందా నిజంగా బంగారంతో చేసిన హోటలే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇదెక్కడుంది దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

వియత్నాం రాజధాని హనోయ్ నగరంలో నిర్మించిన బంగారు హోటల్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఫైవ్ స్టార్ హోటల్ లో ప్రతీది బంగారమే.. గోడల దగ్గరి నుండి టాయిలెట్ దాకా అంతా బంగారమే.. బాత్రూమ్ లో బాత్ టబ్ కూడా బంగారమేనట. గోడలు అయితే 24క్యారెట్ బంగారంతో పూత పూశారట. అలాగని ఇదేమీ కేవలం బస చేయడానికి మాత్రమే కాదు. ఈ హోటల్ లో రెస్టారెంట్, ఫిట్నెట్ సెంటర్, బార్, బిజినెస్ సెంటర్ వంటి అత్యాధునిక సౌకర్యాలు కూడా ఉన్నాయి. అంతేనా.. విదేశీయులు ఇక్కడ బస చేయడానికి వస్తే వారు డబ్బు విషయంలో ఇబ్బంది పడకూడదని 24గంటల పాటు ఇక్కడ కరెన్సీని మార్చుకునే అవకాశం కూడా కల్పించారు హోటర్ వారు. ఈ హోటల్ బిల్డింగ్ మీద నుండి చూస్తే.. హనోయ్ నగరం మొత్తం అద్బుతంగా కనిపిస్తుందట. ఇలాంటి హోటల్ లో ఏ కోటీశ్వరులో ఉండగలరు సాదారణ మనుషులకు ఎక్కడ సాధ్యం అని అనుకుంటారేమో.. కానీ అలా అనుకుంటే పొరబడ్డట్టే..

ఇలాంటి ఫైవ్ స్టార్ హోటల్ లో బస చేయడం కల అని అనుకునేవారు నిరభ్యరంతంగా ఆ కలను ఇక్కడ నెరవేర్చుకోవచ్చు. ఈ హోటల్ లో బస చేయడానికి 9000/- రుపాయల నుండి ధరలు మొదలవుతాయట. ఇక్కడ బస చేసేవారు ఒకానొక రాయల్టీ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తున్నారట. అక్కడ గడిపినన్ని రోజులూ మహారాజుల వైభోగం అనుభవించినట్టే ఫీలవుతారట. మరి అంత పెద్ద హోటల్ లో గడపడం అంటే మాటలా.. సాధారణ జీవితం ఎప్పుడూ ఉండేదే.. జీవితంలో ఇలాంటి ఎంజాయ్ మెంట్ అప్పుడప్పుడు అయినా ఉండాలిగా అని కొందరు ఈ హోటల్ గురించి విన్నవారు అభిప్రాయపడుతున్నారు.

ఈ హోటల్ లో బస చేసిన కొందరు దీని గురించి సదాభిప్రాయం వ్యక్తం చేశారు. హోటల్ సిబ్బంది ప్రవర్తన బాగుందని, బంగారు హోటల్ గురించి విన్నప్పుడు అది నిజంగానే బంగారంతో డిజైన్ చేయబడిందో లేదో అనుకున్నామని, కానీ నిజంగానే హోటల్ మొత్తం బంగారంతో డిజైన్ చేశారని ఆ హోటల్ లో బస చేయడం మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చెప్పుకొచ్చారు.

ఇక హోటల్ ఉన్న హనోయ్ నగర ప్రాంత విశేషం ఏమిటంటే.. దీనికి దగ్గర్లో గోల్డెన్ లేక్ ఉందట. ఇక్కడ ఆద్యాత్మిక వాతావరణం ఎక్కువే, బాచ్ మా ఆలయం, హనోయి ఒపెరా హౌస్, ఇంపీరియల్ సిటాడెల్ ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు. ఇక స్ట్రీట్ ఫుడ్ ను ఎక్కువగా ఇష్టపడే వారికోసం ప్రత్యేకంగా ఒక వీధి కూడా ఉంది. ఈ బంగారు ఫైవ్ స్టార్ హోటల్ లో అందరికీ నచ్చుతున్న మరొక విషయం ఏమిటంటే.. ఈ హోటల్ లో వారు అక్కడ బస చేయడానికి వచ్చే వారికి ఎలాంటి నిబంధనలు విధించలేదట. ఆ హోటల్ లో ఎక్కడైనా స్వేచ్చగా ఫోటోలు కూడా తీసుకోవచ్చట. ఎప్పుడైనా రాయల్టీ లైఫ్ ఒక్కరోజయినా అనుభవించాలని అనుకుంటే అటుగా వెళ్ళినప్పుడు ఈ గోల్డెన్ హోటల్ లో దాన్ని నిజం చేసుకోండి.

Updated Date - 2022-11-19T12:10:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising