Gunasekhar- Shaakuntalam: నమ్మకం నిజమవుతుందా?
ABN, First Publish Date - 2022-11-11T16:03:21+05:30
సమంత (Samantha)తాజాగా రెండు మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాలు చేశారు. అందులో ఒకటి ‘యశోద’(Yashoda), ‘రెండోది గుణశేఖర్ (guna shekar)దర్శకత్వం వహించిన ‘శాకుంతలం’ (Shakuntalam). సమంత స్టార్‌డమ్, ఇమేజ్‌ను దృష్టి పెట్టుకుని దర్శక నిర్మాతలు చేసిన సాహసం ఈ రెండు చిత్రాలు.
సమంత (Samantha)తాజాగా రెండు మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాలు చేశారు. అందులో ఒకటి ‘యశోద’(Yashoda), ‘రెండోది గుణశేఖర్ (Gunasekhar)దర్శకత్వం వహించిన ‘శాకుంతలం’ (Gunasekhar- Shaakuntalam). సమంత స్టార్‌డమ్, ఇమేజ్‌ను దృష్టి పెట్టుకుని దర్శక నిర్మాతలు చేసిన సాహసం ఈ రెండు చిత్రాలు. అందుకే ‘యశోద’ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందా? అని గుణ శేఖర్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మేకర్స్. ఎందుకంటే ఈ రెండు చిత్రాల్లోనూ స్టార్ హీరోలు లేరు. సమంతే కీలకం. యశోద ప్రమోషన్స్‌లో సమంత లేకపోవడం వల్ల ఆమె పేరుకున్న క్రేజ్‌తో ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా లేదా అన్న సందిగ్ధంలో ఉన్నారు మేకర్స్. గతంలో సమంత కీలకంగా నటించిన ‘యు టర్న్’, ‘ఓ బేబీ’ చిత్రాలు మంచి టాక్ తెచ్చుకున్నా.. కమర్షియల్‌గా పెద్దగా వర్కవుట్ కాలేదనే అసంతృప్తి మేకర్స్‌లో ఉందని అప్పట్లో టాక్. యశోద సినిమా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తే.. తాను తీసిన ‘శాకుంతలం’ కూడా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తుందని గుణశేఖర్ నమ్మకం. అయితే ఆయన ఆలోచన కథల పరంగా కాదు. మార్కెట్, క్రేజ్ గురించి. ‘యశోద’తో పోల్చితే ‘శాకుంతలం’ బడ్జెట్ కూడా ఎక్కువే. ‘యశోద’ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వస్తే ఇన్‌డైరెక్ట్‌గా ‘శాకుంతలం’ చిత్రానికి కూడా హెల్ప్ అవుతుంది. గుణశేఖర్ (Gunasekhar- Shaakuntalam) నమ్మకం నిజం అయ్యేలా ఉంది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘యశోద’ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సోషల్ మీడియా అంతా సమంతకు పాజిటివ్‌గా పోస్ట్‌లు పెడుతున్నారు. సినిమా బావుంది అంటూ ప్రశంసిస్తున్నారు. దీంతో గుణశేఖర్‌కు నమ్మకం పెరిగి ధీమాగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.
Updated Date - 2022-11-11T16:03:24+05:30 IST