ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hansika Motwani: పెళ్లి డేట్ ఫిక్స్.. వరుడెవరంటే..?

ABN, First Publish Date - 2022-10-31T16:12:03+05:30

చిన్నతనంలోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా మారిన అందాల భామ హన్సిక హన్సిక మోత్వానీ (Hansika Motwani). డిసెంబర్‌లో పెళ్లి చేసుకొబోతున్నట్టు గతంలోనే చెప్పింది. వరుడి వివరాలను మాత్రం సస్పెన్స్‌గా ఉంచింది.

Hansika Motwani
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిన్నతనంలోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా మారిన అందాల భామ హన్సిక హన్సిక మోత్వానీ (Hansika Motwani). డిసెంబర్‌లో పెళ్లి చేసుకొబోతున్నట్టు గతంలోనే చెప్పింది. వరుడి వివరాలను మాత్రం సస్పెన్స్‌గా ఉంచింది. ఆమె పెళ్లి డేట్‌‌తో పాటు వరుడి వివరాలు తాజాగా బయటికి వచ్చాయి. హన్సిక బిజినెస్ పార్ట్‌నర్‌నే.. లైఫ్ పార్ట్‌నర్‌గా చేసుకొబోతున్నట్టు తెలుస్తోంది.

హన్సిక మోత్వానీ పెళ్లి డిసెంబర్ 4 జరగనుంది. ముంబై వ్యాపారవేత్త సొహైల్ కతురియా (Sohael Kathuriya)ను ఆమె వివాహం ఆడనుంది. గతంలో వీరిద్దరు కలసి బిజినెస్‌ను ప్రారంభించారు. ఆ సమయంలో వీరి ఆలోచనలు, అభిరుచులు కలిశాయి. అప్పటి నుంచి ప్రేమించుకోవడం మొదలుపెట్టారు. తాజాగా పెళ్లి చేసుకొబోతున్నారు. రాజస్థాన్‌ జైపూర్‌లోని 450 ఏళ్ల పురాతన రాచకోట ‘ముందోతా ఫోర్ట్‌ ప్యాలెస్‌’ లో వైభవంగా ఈ వివాహం జరగనుంది. వేడుకకు వచ్చే అతిథుల కోసం హోటల్‌లోని అన్ని గదులు, సూట్స్‌ను బుక్ చేశారు. పెళ్లి పనులు డిసెంబర్ 2 నుంచి ప్రారంభం అవుతాయి. డిసెంబర్ 3 న మెహందీ, సంగీత్, డిసెంబర్ 4న వివాహం జరగనుంది. అతిథులు, సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లికి హాజరు కానున్నారు. ప్రతి రోజు డ్రెస్ కోడ్ ఉందని సమాచారం. కుటుంబ సభ్యుల కోసం పోలో మ్యాచ్‌ను కూడా ఏర్పాటు చేశారట. క్యాసినో థీమ్‌తో పెద్ద విందును ఇవ్వనున్నారట. ఇక హన్సిక కెరీర్ విషయానికి వస్తే.. ‘పార్ట్‌నర్‌’, ‘105 మినిట్స్‌’ మూవీ షూటింగ్స్‌ను పూర్తి చేసింది. మరి కొన్ని సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటుంది. గతంలో హన్సిక, శింబు (Simbu) తో ప్రేమాయణం నడిపింది. కొంత కాలం డేటింగ్ కూడా చేసింది. ఏమైందో తెలియదు కానీ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఫలితంగా ఈ జంట విడిపోయారు. అనంతరం శింబు, హన్సిక స్నేహితులుగా కొనసాగుతున్నారు. హన్సిక నటించిన ఓ సినిమాలో శింబు అతిథి పాత్రను కూడా పోషించాడు.

Updated Date - 2022-10-31T16:13:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising