Hansika Motwani: వైరల్ పిక్స్.. కాబోయే భర్తను పరిచయం చేసిన హన్సిక..
ABN, First Publish Date - 2022-11-02T15:20:20+05:30
స్టార్ హీరోయిన్ హన్సిక మోత్వానీ (Hansika Motwani) త్వరలోనే పెళ్లి చేసుకొబోతున్న సంగతి తెలిసిందే. ఆమె డిసెంబర్ 4న వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నట్టు తెలుస్తోంది. హన్సిక బిజినెస్ పార్ట్‌నర్‌నే.. లైఫ్ పార్ట్‌నర్‌గా చేసుకొబోతుంది.
స్టార్ హీరోయిన్ హన్సిక మోత్వానీ (Hansika Motwani) త్వరలోనే పెళ్లి చేసుకొబోతున్న సంగతి తెలిసిందే. ఆమె డిసెంబర్ 4న వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నట్టు తెలుస్తోంది. హన్సిక బిజినెస్ పార్ట్‌నర్‌నే.. లైఫ్ పార్ట్‌నర్‌గా చేసుకొబోతుంది. ఈ నేపథ్యంలో తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది. ముంబై వ్యాపారవేత్త సొహైల్ కతురియా (Sohael Kathuriya)ను ఆమె వివాహం ఆడనుంది. తాజాగా అతడి ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.
హన్సిక, సొహైల్ కలసి గతంలో బిజినెస్‌ను ప్రారంభించారు. ఆ సమయంలో వీరి ఆలోచనలు, అభిరుచులు కలిశాయి. అప్పటి నుంచి ప్రేమించుకోవడం మొదలుపెట్టారు. దీంతో విహహ బంధంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి దగ్గర పడటంతో కాబోయే భర్త పిక్స్‌ను షేర్ చేసింది. పారిస్‌లోని ఈపిల్ టవర్ వద్ద దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది. ‘‘ఇప్పుడు ఎల్లప్పుడు ప్రేమిస్తూనే ఉంటా’’ అని ఆమె పేర్కొంది. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోల్లో.. సొహైల్ మోకాలిపై కూర్చొని హన్సికకు ప్రపోజ్ చేశాడు. అందుకు ఆమె అంగీకారం తెలిపింది. అతడిని ప్రేమగా కౌగిలించుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు వీరికి శుభాకాంక్షలు చెప్పారు.
రాజస్థాన్ జైపూర్‌లోని 450 ఏళ్ల పురాతన రాచకోట ‘ముందోతా ఫోర్ట్ ప్యాలెస్’ లో వైభవంగా ఈ వివాహం జరగనుంది. వేడుకకు వచ్చే అతిథుల కోసం హోటల్‌లోని అన్ని గదులు, సూట్స్‌ను బుక్ చేశారు. పెళ్లి పనులు డిసెంబర్ 2 నుంచి ప్రారంభం అవుతాయి. డిసెంబర్ 3 న మెహందీ, సంగీత్, డిసెంబర్ 4న వివాహం జరగనుంది. అతిథులు, సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లికి హాజరు కానున్నారు. ప్రతి రోజు డ్రెస్ కోడ్ ఉందని సమాచారం. కుటుంబ సభ్యుల కోసం పోలో మ్యాచ్‌ను కూడా ఏర్పాటు చేశారట. క్యాసినో థీమ్‌తో పెద్ద విందును ఇవ్వనున్నారట. ఇక హన్సిక కెరీర్ విషయానికి వస్తే.. ‘పార్ట్‌నర్’, ‘105 మినిట్స్’ మూవీ షూటింగ్స్‌ను పూర్తి చేసింది. మరి కొన్ని సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటుంది.
Updated Date - 2022-11-02T15:26:14+05:30 IST