Samantha: ఒక్కో రోజు ఒక్క అడుగు కూడా వేయలేనేమో అనిపిస్తుంది..
ABN, First Publish Date - 2022-11-08T12:31:06+05:30
నా పోస్ట్‌లో నేను చెప్పినట్లుగా.. మనకి అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఒకరోజు ఒకలా.. మరొక రోజు మరోలా ఉంటుంది. నాకు ఒక్కో రోజు.. ఇంకొక్క అడుగు కూడా ముందుకు
స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘యశోద’ (Yashoda). ఈ సినిమా పాన్ ఇండియా (Pan India) స్థాయిలో నవంబర్ 11న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. అయితే ఈ మధ్య సమంత మయోసైటిస్ (Myositis) అనే వ్యాధితో బాధపడుతున్నట్లుగా ఓ పిక్ పెట్టి.. ఆ వ్యాధికి సంబంధించిన వివరాలను తెలియజేసింది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్‌కి ఆమె రాదని అంతా అనుకున్నారు.. కానీ తాజాగా ట్విట్టర్‌లో తన స్నేహితులు.. ఇటువంటి సమయంలో ధైర్యంగా పోరాడాలని చెప్పిన మాటల్ని స్ఫూర్తిగా తీసుకుని.. ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నట్లుగా ప్రకటించింది. ఆమె చెప్పినట్లుగానే ‘యశోద’ సినిమా కోసం ఇప్పుడు యాంకర్ సుమ (Anchor Suma)తో ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో సినిమా విశేషాలతో పాటు.. తన ఆరోగ్యానికి సంబంధించిన రూమర్స్‌పై కూడా సమంత రియాక్ట్ అయింది.
రీసెంట్‌గా మీరు సోషల్ మీడియా వేదికగా.. మీకు వచ్చిన అనారోగ్యం గురించి తెలిపారు. అసలు అలా తెలపడానికి నిజంగా ఎంతో ధైర్యం కావాలి. అంత ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చింది అని సుమ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘నా పోస్ట్‌లో నేను చెప్పినట్లుగా.. మనకి అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఒకరోజు ఒకలా.. మరొక రోజు మరోలా ఉంటుంది. నాకు ఒక్కో రోజు.. ఇంకొక్క అడుగు కూడా ముందుకు వేయలేనేమో అనిపిస్తుంది. (కన్నీళ్లు పెట్టుకుంటూ..) కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. ఇంత దూరం వచ్చానా? అని అనిపిస్తుంది. కానీ యుద్ధం చేయాలి. నేనొక్కదానినే కాదు.. బయట ఎంతో మంది జీవితం కోసం యుద్ధం చేస్తున్నారు. చివరికి ఖచ్చితంగా విజయం సాధిస్తాం. నేను చాలా ఆర్టికల్స్ చూశాను.. నాకున్న వ్యాధి చాలా ప్రాణాంతకరమైన వ్యాధి అని రాశారు. కానీ ప్రస్తుతం నేనున్న స్టేజ్‌లో అది ప్రాణాంతకమైనది మాత్రం కాదు. ప్రస్తుతానికైతే నేను చావలేదు. అటువంటి హెడ్‌లైన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇబ్బంది మాత్రం ఉంది.. నేను ఇంకా ఫైట్ చేస్తూనే ఉన్నా.. పూర్తిగా కోలుకోవడానికి ఇంకాస్త టైమ్ పడుతుంది. ప్రస్తుతానికైతే నేను చావట్లేదు...’’ అని సమంత చెప్పుకొచ్చింది. (Samantha about her Health condition)
Updated Date - 2022-11-08T12:47:04+05:30 IST