Viral News: పెళ్లైన మరుసటి రోజే భార్యపై భర్త పోలీస్ కంప్లైంట్.. ఫిర్యాదు ఏంటంటే..!
ABN, First Publish Date - 2022-12-31T10:19:18+05:30
వాళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆ విషయాన్నే ఇంట్లో చెప్పి పెళ్లి సిద్ధమయ్యారు. కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఇంత వరకూ బాగానే ఉంది. కానీ పెళ్లైన రోజు రాత్రే వధువుకు..
ఇంటర్నెట్ డెస్క్: వాళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆ విషయాన్నే ఇంట్లో చెప్పి పెళ్లి సిద్ధమయ్యారు. కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఇంత వరకూ బాగానే ఉంది. కానీ పెళ్లైన రోజు రాత్రే వధువుకు సంబంధించిన షాకింగ్ నిజం ఆ వరుడికి తెలిసింది. దీంతో మరుసటి రోజు ఉదయమే అతడు పోలీస్ స్టేషన్‌కు పరుగులు పెట్టాడు. దీంతో ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
ఈ ఘటన హర్యానా(Haryana)లోని దర్గాపూర్‌లో చోటు చేసుకుంది. సుఖాలాల్ అనే 30ఏళ్ల యువకుడికి సోషల్ మీడియా(Social Media)లో ఓ యువతి పరిచయం అయింది. ఆ పరిచయం తర్వాత స్నేహంగా.. ఆ తర్వాత ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో ఆ యువతి, యువకులు తమ ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పారు. వాళ్ల అనుమతితోనే తాజాగా స్థానికంగా ఉన్న రాధాకృష్ణ ఆలయంలో వివాహం(Love Marriage) చేసుకున్నారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు వధూవరులకు శోభనాన్ని ఏర్పాటు చేశారు. అయితే.. తొలిరాత్రి వధువుకు సంబంధించిన షాకింగ్ నిజం అతడికి తెలిసింది. ఇంత కాలం తను ప్రేమించి, పెళ్లి చేసుకున్న అమ్మాయి.. ఓ ట్రాన్స్‌జెండర్ అని తెలిసి విస్తుపోయాడు.
మరుసటి రోజు ఉదయం పోలీస్ స్టేషన్(Police Complaint)కు చేరుకున్నాడు. తను మోసపోయానంటూ జరిగిన విషయాన్ని చెప్పి వాపోయాడు. విడాకులు కోరితే.. తన భార్య భారీ మొత్తంలో డిమాండ్ చేస్తున్నట్టు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న అధికారులు విచారణ ప్రారంభించారు. దీంతో ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.
Updated Date - 2022-12-31T10:25:38+05:30 IST