ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

shraddha case: అఫ్తాబ్‌కు నార్కో టెస్ట్‌ కోసం చకచకా ఏర్పాట్లు.. ఎలా చేస్తారో తెలుసా..

ABN, First Publish Date - 2022-11-22T20:00:13+05:30

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాల్కర్ హత్య కేసులో (Shraddha Walkar murder case) నిందితుడు అఫ్తాబ్ పూనావాలాకు (Aaftab Poonawala) నార్కోఅనాలిసిస్ టెస్ట్ (narcoanalysis test) నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాల్కర్ హత్య కేసులో (Shraddha Walkar murder case) నిందితుడు అఫ్తాబ్ పూనావాలాకు (Aaftab Poonawala) నార్కోఅనాలిసిస్ టెస్ట్ (narcoanalysis test) నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే కోర్టు అనుమతి దక్కడం, అఫ్తాబ్ కూడా సమ్మతం తెలపడంతో ఢిల్లీ పోలీసులు, ఫోరెన్సిక్, మెడికల్ నిపుణులు టెస్టు కోసం సన్నద్ధమవుతున్నారు. ఢిల్లీ అంబేద్కర్ హాస్పిటల్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నార్కోఅనాలిస్ టెస్టును ఏవిధంగా నిర్వహిస్తారో ఓ లుక్కేద్దాం...

నార్కోఅనాలిసిస్ ఎందుకు?.. ఎలా నిర్వహిస్తారు?..

నార్కోఅనాలిసిస్ టెస్టులో అనస్థీషియా (మత్తుమందు) ఉపయోగించి సంబంధిత వ్యక్తిని అపస్మారక స్థితిలోకి (unconscious) పంపిస్తారు. ఆ ప్రత్యేక స్థితిలో ఆ వ్యక్తి నిజాలే మాట్లాడుతాడు. అయితే టెస్టు నిర్వహించాలంటే మాత్రం వ్యక్తి భౌతికంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని నోయిడాలోని వినాయక్ హాస్పిటల్‌ ఎండీ డాక్టర్ సౌరబ్ చౌదరి వివరించారు. అనాస్థీషియాలజిస్ట్, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ అనుజ్ త్రిపాఠి స్పందిస్తూ.. నార్కో టెస్ట్ సమయంలో సంబంధిత వ్యక్తికి మెడిసిన్ (ఇంజెక్షన్) ఇస్తారని, దీనినే ‘ట్రూత్ సీరం’గా పిలుస్తారని చెప్పారు. ఈ ట్రూత్ సీరమే వ్యక్తి మెదడును అపస్మారక స్థితిలోకి తీసుకెళ్తుంది. అయితే కొన్ని ఖచ్చితమైన డిగ్రీల వద్ద మాత్రం ఆ వ్యక్తికి వినగలిగే, మాట్లాడగలిగే సామర్థ్యం ఉంటుంది. ఇందుకోసం అనస్థీషియాను మెడికల్‌గా తగిన మోతాదులో ఉపయోగించడం చాలా ముఖ్యం. వ్యక్తి బరువు, ఆ వ్యక్తి ఆరోగ్యం ఆధారంగా అనస్థీషియా ఎంత ఇవ్వాలనేది నిర్ణయిస్తారు. ఈ ప్రక్రియలో ఆ వ్యక్తి ఆరోగ్యాన్ని అనుక్షణం పర్యవేక్షిస్తూనే ఉంటారని నిపుణులు చెబుతున్నారు. సంబంధిత వ్యక్తి ప్రవర్తన, గుండె రేటు, ఇతర లక్షణాలను డిజిటల్ పరికరాల సాయంతో రికార్డు చేస్తారు. వాటి ఆధారంగా నిజం చెబుతున్నాడో.. ఉద్దేశ్యపూర్వకంగా ఏమార్చుతున్నాడా అనేది గ్రాఫ్‌ల ద్వారా అవగాహనకు రావొచ్చు.

అయితే నార్కోఅనాలిస్ టెస్ట్‌.. పాలీగ్రఫీ టెస్టుతో ముడిపడివుండడంతో సంబంధిత వ్యక్తి టెస్ట్‌ను తప్పుదోవపట్టించే అవకాశాలు లేకపోలేదని పునీత్ జైన్ అనే క్లినికల్ సైకాలజిస్ట్ చెప్పారు. ట్రూత్ సీరం ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తిని అడిగే ప్రశ్నలు చాలా సంక్షిప్తంగా ఉంటాయని, కాబట్టి ఆ వ్యక్తి నుంచి సమాధానాలను పూర్తిగా నమ్మాల్సిన అవసరంలేదని పేర్కొన్నారు. అయితే నార్కో టెస్ట్ ద్వారా ఏ దిశగా విచారణ చేయాలనేదానిపై ఒక క్లారిటీ వస్తుందని మాజీ పోలీసులు చెబుతున్నారు. ఇందుకు తమ అనుభవాన్ని ప్రస్తావిస్తున్నారు. మరి శ్రద్ధా కేసులో నార్కోఅనాలిసిస్ టెస్ట్ ఎంతవరకు ఉపయోగపడుతుందో వేచిచూడాలి.

Updated Date - 2022-11-22T20:27:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising