ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Zombie Angelina Jolie: ఈమె గురించి నిజం తెలిసిపోయింది..

ABN, First Publish Date - 2022-10-27T17:09:17+05:30

జాంబీ జోలీగా వైరల్ అయిన తన ఫొటో వెనుక అసలు కథను వెల్లడించిన ఇరాన్ యువతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: పైన ఫొటో చూశారుగా.. మీరు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండేవారైతే ఈ ఫొటోను ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటారు. ఆ ఫొటో ఓ ఇరాన్(Iran) యువతిది. సహార్ తబార్‌గా(Sahar Tabar) ఆమె అందరికీ పరిచయం. నెటిజన్లు ఆమెను ‘జాంబీ యాంజెలీనా జోలి’(Zombie Angelina Jolie) అని కూడా పిలుస్తుంటారు. హాలీవుడ్ నటి యాంజెలీనా జోలీలాగే(Angelina jolie) కనిపించాలనే ఉద్దేశంతో తన ముఖానికి గతంలో అనేక ఆపరేషన్లు చేయించుకుంది. మొత్తం 50కి పైగా శస్త్రచికిత్సలు జరిగాయని ఆమె చెప్పుకొంది. శస్త్రచికిత్సల తరువాత... సహార్ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఫొటోల్లో ఆమె వికృతంగా కనిపించడంతో అందరూ జాంబీ(దెయ్యం) అని పిలవడం మొదలెట్టారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. ఆ ఫొటో వెనుకున్న నిజాన్ని సహార్ ఇటీవలే బయటపెట్టింది. ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యాక ఆమె చెప్పిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

2019లో సహార్ హిజాబ్‌ను అవమానించినందుకు జైలు పాలయ్యారు. ఇటీవలే విడుదలైన ఆమె ఓ టీవీ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. ముఖ్యంగా ఆపరేషన్లకు ముందు తాను ఎలా ఉండేదో చెప్పే ఫొటోలు బయటపెట్టడంతో అందరూ అవాక్కవుతున్నారు. అయితే.. జాంబీ పేరిట ప్రజలకు తెలిసిన ఫొటోల్లో కనిపించినట్టు తాను ఉండనని ఆమె చెప్పుకొచ్చారు. బాగా మేకప్ వేసుకుని ఫొటో దిగి, దానికి ఫొటో ఎడిటింగ్‌తో మరిన్ని మార్పులు చేసి వికృత ఆకృతి వచ్చేలా చేశానని చెప్పుకొచ్చింది. తల్లిదండ్రులు ఆమెకు ఫతామే ఖిష్వండ్ అని నామకరణం చేస్తే ఆమె తన పేరును సహార్‌గా మార్చుకుని ప్రపంచం ముందుకొచ్చింది. అంతర్జాతీయంగా పాపులారిటీ సంపాదించాలని ఆమెకు చిన్ననాటి కోరిక. ఈ క్రమంలో ఆమె ఇలా శస్త్రచికిత్సలు చేయించుకున్నట్టు కూడా వెల్లడించింది.

ఇటీవల ఇరాన్‌లో హిజాబ్‌ను(Hijab) వ్యతిరేకించి అమీన్ మాసా అనే యువతి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ తరువాత.. ఇరాన్ మహిళలు కట్టుబాట్లకు వ్యతిరేకంగా కదం తొక్కారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు సహార్‌ను కూడా విడుదల చేశారు. ఆమె విడుదలైన విషయాన్ని తొలుత మాసీ అలీనెజాద్ అనే సామాజిక కార్యకర్త సోషల్ మీడియాలో ప్రకటించారు. ఇక సహార్ అరెస్టయిన సమయంలో ఆమె సామాజిక మాధ్యమాల్లో ప్రపంచ ప్రజల మద్దతు కోరారు. ‘‘సహార్ అరెస్టయ్యే నాటికి ఆమె వయసు కేవలం 19. జైలు పాలైన కూతురుని తలుచుకుని ఆమె తల్లి కన్నీరు కార్చని రోజు లేదు.’’ అని అప్పట్లో ఆమె పేర్కొన్నారు. ఈ విషయంలో హాలీవుడ్ నటి యాంజలీనా జోలీ కూడా స్పందించాలని అప్పట్లో ఆమె విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-10-27T17:54:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising