ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Medical Scrubs: ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్లు ఈ దుస్తులనే ధరిస్తారు.. ఎందుకో తెలుసా..

ABN, First Publish Date - 2022-11-08T16:32:38+05:30

ఆపరేషన్ థియేటర్లలో వైద్యులు నీలం, ఆకుపచ్చ దుస్తులు ధరించడం వెనుకున్న రెండు కారణాలు ఏంటంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఆపరేషన్‌ థియేటర్లలో వైద్యులు(Doctors) ఆకుపచ్చ, లేదా నీలి రంగు దుస్తుల్లోనే కనిపిస్తుంటారు. వీటిని ఇంగ్లిష్‌లో స్క్రబ్స్(Scrubs) అంటారు. మరి వాళ్లు ఇలాంటి రంగుల దుస్తులనే ఎందుకు ధరిస్తారనే సందేహం మీకు కలిగిందా..? ఆ రంగులకు ఉన్న ప్రత్యేక ఏంటి.. శస్త్రచికిత్సకు వీటికి ఏమైనా సంబంధం ఉందా అని ఎప్పుడైనా ఆలోచించారా..? అయితే.. ఈ ప్రత్యేక కథనం మీకోసమే..!

ఆకుపచ్చ(Green), నీలి(Blue) రంగు స్క్రబ్స్ వాడకం ఇరవైయ్యో శతాబ్దం తొలి నాళ్లలో ప్రారంభమైందట. అంతుకుముందు వైద్యులు తెల్లని దుస్తులనే ధరించేవారు. అయితే..అప్పటి ప్రముఖ డాక్టర్ ఒకరు ఆకుపచ్చ, నీలి రంగులు కళ్లపై ఒత్తడిని తగ్గిస్తాయని భావించి వీటిని ప్రవేశపెట్టారట. నాటి నుంచి వైద్యులు వీటినే వాడటం మొదలు పెట్టారనేది బాగా ప్రచారంలో ఉన్న ఓ కథనం.

ఇక తెలుపు కంటే ఈ రెండు రంగులే వైద్యులకు ఉపయుక్తమైనవని శాస్త్రపరంగా నిరూపితమైంది కూడా..! ఆకుపచ్చ, నీలి రంగు దుస్తులు ధరిస్తే వైద్యుల కళ్లపై ఒత్తిడి తగ్గి వారు మరింత స్పష్టంగా చూడగలుగుతారు. సర్జరీల సందర్భంగా ఎర్రని రక్తం, కండరాలను తదేకంగా చూడటం వల్ల కళ్లు అలసిపోతాయి. ఫలితంగా విభిన్న రంగుల్ని గుర్తుపట్టే శక్తి కాస్తంత తగ్గుతుంది. మన మెదడు పనితీరే ఇందుకు కారణమని వైద్య శాస్త్రం చెబుతోంది. రంగుల మధ్య ఉన్న తేడాల ఆధారంగా మెదడు వాటిని గుర్తిస్తుంది. దీంతో.. తదేకంగా ఎర్ర రంగును చూస్తే.. మెదడు దానికి అలవాటుపడిపోతుంది. దీంతో.. వివిధ ఎర్రటి షేడ్‌లలో ఉండే శరీర అంతర్భాగాల్ని స్పష్టంగా గుర్తుపట్టలేకపోవచ్చు. అలాంటప్పుడు.. ఆకుపచ్చ రంగును కాసేపు చూస్తే మెదడు, కళ్లు రీఫ్రెష్ అవుతాయి.

ఇక తదేకంగా ఎర్రటి వాటిని చూశాక..చూపును తెల్లటి వస్తువుల వైపు మళ్లిస్తే కళ్లుముందు ఏవో ఆకుపచ్చటి ఆకారాలు కదలాడుతున్నట్టు అనిపిస్తుంది. వీటినే ఇల్యూషన్స్ అని అంటారు. దీన్ని నివారించేందుకు ఆకుపచ్చ, లేదా నీలి రంగు స్క్రబ్స్ ఉపయోగపడతాయి. అవి కంటిని రీఫ్రెష్ చేసి ఇల్యూషన్స్ తలెత్త కుండా చేస్తాయి. దీంతో.. వైద్యులు ఈ రెండు రంగుల్లోని స్క్రబ్స్ ఎక్కువగా వినియోగిస్తారు.

Updated Date - 2022-11-08T16:42:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising