ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Krishna Vamsi: హీరోయిన్ల అందంపై షాకింగ్ కామెంట్స్

ABN, First Publish Date - 2022-11-21T14:37:33+05:30

హిట్టు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా డైరెక్టర్ కృష్ణవంశీ (Director Krishna Vamsi) సినిమాలకు ప్రత్యేక అభిమానులు ఉంటారు. ఆయన తీసే సినిమాలు ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంటాయి. సినిమా నిర్మాణం పరంగా

Krishna Vamsi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హిట్టు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా డైరెక్టర్ కృష్ణవంశీ (Director Krishna Vamsi) సినిమాలకు ప్రత్యేక అభిమానులు ఉంటారు. ఆయన తీసే సినిమాలు ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంటాయి. సినిమా నిర్మాణం పరంగా ఆయన అద్భుతమైన టెక్నిషీయన్ అని ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించుకున్నారు. అయితే ఎటువంటి డైరెక్టర్‌కి అయినా సక్సెస్, ఫెయిల్యూర్స్ ఉండటం సహజమే. కానీ కృష్ణవంశీ సినిమాల విషయానికి వస్తే.. ఖచ్చితంగా ఏదో ఒక కొత్త విషయం మాత్రం ఆయన సినిమాలలో ఉంటుందనేలా.. మొదటి సినిమా నుండి ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. మరో విషయంలో కూడా కృష్ణవంశీ పేరు ఎప్పుడూ వార్తలలో నిలుస్తూ ఉంటుంది. హీరోయిన్లను అందంగా చూపించడంలో కృష్ణ వంశీ మార్క్ వేరు. అందుకే ప్రతి హీరోయిన్ ఆయన దర్శకత్వంలో కనీసం ఒక్క సినిమా అయినా చేయాలని కలలు కంటుంటారు. హీరోయిన్లు అలా కోరుకుంటుంటే.. అసలు హీరోయిన్ల అందం గురించే పట్టించుకోనంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. (Krishna Vamsi Sensational Comments on Heroines)

నేను సినిమాలు చేసే సమయంలో హీరోయిన్లపై పెద్దగా దృష్టి పెట్టనని ఆయన చేసిన వ్యాఖ్యలను విన్నవారంతా షాక్ అవుతున్నారు. ఆయన దృష్టి పెట్టకపోతేనే.. హీరోయిన్లు అంత అందంగా కనబడితే.., నిజంగా ఆయన దృష్టి పెడితే.. ఇండస్ట్రీలో హీరోయిన్ల డామినేషన్ పెరిగిపోతుందేమో. సరే విషయంలోకి వస్తే.. తన తాజా ఇంటర్వ్యూలో కృష్ణ వంశీ మాట్లాడుతూ.. ‘‘నేను హీరోయిన్లను బాగా చూపిస్తానని అంతా అనుకుంటూ ఉంటారు. కానీ నేను హీరోయిన్లపై పెద్దగా దృష్టి పెట్టను. అందుకు కారణం ఏమిటంటే.. మాములుగానే వారంతా అందగత్తెలు. వారు అందంగా ఉంటారు కాబట్టే.. హీరోయిన్లుగా సినిమాలు చేస్తున్నారు. అలాంటి వారిని నేను అందంగా చూపించేది ఏముంటుంది. కెమెరాకు అనుగుణంగా పెట్టే యాంగిల్స్‌ కారణంగా.. వారి అందానికి మరింత వన్నె వస్తుంది అంతే. ఈ విషయంలో కొందరు నన్ను బాపుగారితో పోల్చుతూ ఉంటారు. ఆయన లెజండరీ డైరెక్టర్. ఆయనతో నన్ను నేను పోల్చుకోలేను..’’ అని కృష్ణవంశీ చెప్పుకొచ్చారు. ఇంకా హిట్టు, ఫ్లాప్‌లపై కృష్ణవంశీ మాట్లాడుతూ.. నేను వరుస సిక్సర్‌లను చూశాను.. అలాగే డకౌట్స్ కూడా చూశాను అంటూ చమత్కరించారు. మొదట్లో హిట్ వస్తే చాలా గర్వంగా అనిపించేది. ఆ తర్వాత కొన్ని సినిమాల తర్వాత.. మనదేం లేదనే విషయం అర్థమైంది. నా కెరీర్‌లో ది బెస్ట్ చిత్రం ఏదీ అని నన్ను అడిగితే మాత్రం ఇప్పటికీ చెప్పలేనని అన్నారు. ప్రస్తుతం మన అమ్మానాన్నల కథ అంటూ ‘రంగమార్తాండ’ అనే చిత్రంతో వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంతో ఆయన మళ్లీ తన ఫామ్‌ని ప్రదర్శిస్తారని భావిస్తూ.. సినిమా కోసం అంతా వేచి చూస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - 2022-11-21T14:56:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising