ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Liger: పూరీ, ఛార్మిలకు ఈడీ సమన్లు

ABN, First Publish Date - 2022-11-17T19:45:01+05:30

లైగర్ సినిమాకు పెట్టుబడులు పూరీ, ఛార్మిలకు అక్రమ మార్గంలో వచ్చాయని ఈడీ అధికారులు పేర్కొన్నారు. డమ్మీ ఖాతాల నుంచి వారికి డబ్బులు వచ్చాయని చెప్పారు. విదేశీ అకౌంట్స్ నుంచి పలు లావాదేవీలు జరిపినట్టు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయ్ దేవర కొండ (Vijay Deverakonda) హీరోగా నటించిన సినిమా లైగర్ (Liger). పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) డైరెక్షన్ చేయడంతో పాటు నిర్మాతగా వ్యవహరించాడు. ఛార్మీ కౌర్ (Charmee Kaur) సహ నిర్మాతగా వ్యవహరించింది. దాదాపుగా రూ.100కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. లైగర్ సినిమాకు పెట్టుబడులు పూరీ, ఛార్మీలకు అక్రమ మార్గంలో వచ్చాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు పేర్కొన్నారు. డమ్మీ ఖాతాల నుంచి వారికి డబ్బులు వచ్చాయని చెప్పారు. విదేశీ అకౌంట్స్ నుంచి పలు లావాదేవీలు జరిపినట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో పూరీ, ఛార్మీలకు ఈడీ అధికారులు సమన్లు అందజేశారు. ఈ లావాదేవీల విషయంలో వారిద్దరిని ప్రశ్నిస్తున్నారు. ‘లైగర్’ పాన్ ఇండియాగా తెరకెక్కింది. పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకులేకపోయింది. బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది. ‘లైగర్’ ను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించడంతో.. డిస్ట్రిబ్యూటర్స్‌కు కూడా భారీ ధరలకు అమ్మారు. ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్స్‌కు నష్టాన్ని మిగిల్చింది. ఫలితంగా వారంతా నష్టపరిహారాన్ని ఇవ్వాలని పూరీ జగన్నాథ్‌ను కోరారు. ఇంటి ముందు ధర్నా చేస్తామంటూ హెచ్చరించారు. దీంతో తనకు భద్రతను కల్పించాలని కోరుతూ పూరీ జగన్నాథ్ పోలీసులను ఆశ్రయించాడు.

‘లైగర్‌’ (Liger) పరాజయం అనంతరం పూరీ జగన్నాథ్‌పై ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అతడి ఆర్థిక పరిస్థితి, కెరీర్‌ గురించి నెటిజన్స్ పలు రకాలుగా మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో పూరీ ఓ లేఖను విడుదల చేశాడు. భావోద్వేగంగా స్పందించాడు. జీవితంలో జయాపజయాలు సర్వసాధారణమని పేర్కొన్నాడు. జీవితాన్ని ఒక సినిమాలా చూడాలని, అది విజయం సాధిస్తే డబ్బు వస్తుందని, పరాజయం పొందితే బోలెడు జ్ఞానం లభిస్తుందని తెలిపాడు. తాను ఎవరిని మోసం చేయలేదన్నాడు. ఎవరినైనా మోసం చేస్తే అది ప్రేక్షకులను మాత్రమే అని చెప్పాడు. మళ్లీ ఓ సినిమా చేసి ఆడియన్స్‌ను అలరిస్తానని చెప్పిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-11-17T20:31:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising