ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఎన్నో ఏళ్లు ప్రయత్నించి గూగుల్‌లో జాబ్ సాధించాడు.. అతడి తల్లి, సోదరి రియాక్షన్స్ చూస్తే..!

ABN, First Publish Date - 2022-11-14T16:34:42+05:30

ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత అద్విన్ రాయ్ అనే యువకుడు గూగుల్ సంస్థలో ఉద్యోగం సాధించాడు. ఎంతో సంతోషంతో ఇంటికి వెళ్లాడు. ఇంటికి వెళ్లి తల్లి, సోదరికి విషయం చెప్పాడు. వారి రియాక్షన్స్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత అద్విన్ రాయ్ అనే యువకుడు గూగుల్ (Google) సంస్థలో ఉద్యోగం సాధించాడు. ఎంతో సంతోషంతో ఇంటికి వెళ్లాడు. అతడు చెప్పే విషయం కోసం ఇంటి దగ్గర తల్లి, సోదరి కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తనకు గూగుల్‌లో (Google interview) జాబ్ వచ్చిన విషయం ఆ యువకుడు వారిద్దరికీ చెప్పాడు. వారి రియాక్షన్స్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. అంతేకాదు ఆ యువకుడు తన ప్రయత్నం గురించి కూడా సోషల్ మీడియాలో పేర్కొన్నాడు.

నేను 2013 నుంచి గూగుల్‌లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేస్తున్నాను. నేను ప్రతి సంవత్సరం తప్పకుండా అప్లై చేసేవాడిని. ఎప్పుడూ వారి నుంచి నాకు సమాధానం వచ్చేది కాదు. అప్పుడు నా తప్పు ఏమిటో నేను వెతికేవాడిని. నా రెజ్యూమ్, పోర్ట్‌ఫోలియోలో మార్పులు చేసి మళ్లీ ప్రయత్నించేవాడిని. నేను ప్రముఖ కళాశాల నుండి డిగ్రీని పొందలేకపోవడం ఒక కారణం కావచ్చనిపించింది. అయితే దానికి నేనేం చేయలేను. కానీ, నా పోర్ట్‌ఫోలియో , రెజ్యూమ్‌లను మెరుగుపరచుకోవడం మాత్రం నా చేతిలోనే ఉంది. కాబట్టి అనేక విఫల ప్రయత్నాల తర్వాత, నేను ఇక్కడ ఉన్నానని అద్విన్ రాయ్ పేర్కొన్నాడు.

ఇన్ని సంవత్సరాల విఫల యత్నాల ద్వారా తానేం నేర్చుకున్నాడో కూడా తెలిపాడు. ప్రయత్నిస్తూ ఉండండి, మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోండి. మీరు కోరుకున్నదానిని మీరు సాధిస్తారు. Googleలో ప్రవేశించడానికి మీకు ఫ్యాన్సీ డిగ్రీ అవసరం లేదు. మీరు చేసే పనిలో మీరు మంచిగా ఉంటే చాలు. మీకు అనుకూలంగా జరగడం లేదని నిరాశపడకండి. ఓపిక పట్టండి. మీ చేతుల్లో ఉన్న విషయాలపై దృష్టి పెట్టండని అద్విన్ సలహా ఇచ్చాడు. తనకు గూగుల్‌లో జాబ్ వచ్చిందని చెప్పగానే తల్లి, సోదరి సంతోషపడిన దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Updated Date - 2022-11-14T16:34:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising