పెళ్లైన కూతురు కూడా తండ్రి ఉద్యోగం పొందవచ్చు.. స్పష్టం చేసిన అలహాబాద్ హైకోర్టు!

ABN, First Publish Date - 2022-12-05T18:10:29+05:30

ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని అత్తింటికి వెళ్లిపోతే ఆమెకు పుట్టింటితో సంబంధం ఉండదని చాలా మంది భావిస్తుంటారు. ఇంటి పేరు మారిపోయిన తర్వాత ఆమెకు తండ్రి ఆస్తిపై హక్కు ఉండదని అంటుంటారు. అయితే అలాంటి ఆలోచనా ధోరణిని మార్చుకోవాలని తాజాగా అలహాబాద్ హైకోర్టు సూచించింది.

పెళ్లైన కూతురు కూడా తండ్రి ఉద్యోగం పొందవచ్చు.. స్పష్టం చేసిన అలహాబాద్ హైకోర్టు!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని అత్తింటికి వెళ్లిపోతే ఆమెకు పుట్టింటితో సంబంధం ఉండదని చాలా మంది భావిస్తుంటారు. ఇంటి పేరు మారిపోయిన తర్వాత ఆమెకు తండ్రి ఆస్తిపై హక్కు ఉండదని, ఆమె ఆ కుటుంబంలో భాగస్వామి కాదని అంటుంటారు. అయితే అలాంటి ఆలోచనా ధోరణిని మార్చుకోవాలని తాజాగా అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) సూచించింది. పెళ్లై వెళ్లిపోయిన అమ్మాయి కూడా మాతృ కుటుంబంలో సభ్యురాలేనని స్పష్టం చేసింది.

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జే బ్లాక్‌ కాలనీలో నివసిస్తున్న అరుణ తండ్రి రాష్ట్ర ఆరోగ్య శాఖలో పని చేసేవారు. ఉద్యోగంలో ఉండగానే ఆయన 2018లో మరణించారు. దీంతో తండ్రి ఉద్యోగం తనకు ఇవ్వాలని, కుటుంబ బాధ్యతలు మొత్తం తనపైనే ఉన్నాయని ఆరుణ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసింది. అందుకు అధికారులు నిరాకరించి అరుణకు ఉద్యోగం ఇవ్వలేదు. పెళ్లైన కూతురు తండ్రి ఉద్యోగం పొందడానికి అనర్హురాలని సీఎంవో పేర్కొంది. సీఎంవో ఆదేశాలను అరుణ హైకోర్టులో సవాలు చేసింది. ఈ కేసును విచారించిన అలహాబాద్ హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.

అరుణకు ఉద్యోగాన్ని నిరాకరించడం ద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15లను ప్రభుత్వ అధికారులు ఉల్లంఘించారని న్యాయమూర్తి విక్రమ్ డి చౌహాన్ అభిప్రాయపడ్డారు. పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన కూతురు కూడా మాతృకుటంబంలో భాగమేనని పేర్కొన్నారు. ఈ విషయంలో ఆలోచనా ధోరణి మారాలన్నారు. అరుణకు ఆమె తండ్రి శ్యామ్‌లాల్ స్థానంలో ఉద్యోగం ఇవ్వాలని (Married daughter can get father's job) ఆదేశించారు.

Updated Date - 2022-12-05T18:10:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising