ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తల్లి ప్రేమ అంటే ఇదే.. 6 నెలల కూతురి ప్రాణాలను కాపాడటం కోసం ఆమె ఎంత రిస్క్ చేసిందంటే..

ABN, First Publish Date - 2022-11-09T18:37:56+05:30

ఆ మహిళ మేత కోసం గేదెలను అడవిలోకి తీసుకెళ్లింది.. తనతో పాటు ఆరు నెలల కూతురిని కూడా వెంట తీసుకెళ్లింది.. కూతురిని ఒక దగ్గర ఉంచి గేదెల దగ్గరకు వెళ్లింది.. అంతలో ఆమెకు పాప ఏడుపు శబ్దం వినిపించింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ మహిళ మేత కోసం గేదెలను అడవిలోకి తీసుకెళ్లింది.. తనతో పాటు ఆరు నెలల కూతురిని కూడా వెంట తీసుకెళ్లింది.. కూతురిని ఒక దగ్గర ఉంచి గేదెల దగ్గరకు వెళ్లింది.. అంతలో ఆమెకు పాప ఏడుపు శబ్దం వినిపించింది.. తన కూతురిని ఓ హైనా ఈడ్చుకెళ్లడం చూసింది.. దీంతో ఆ మహిళ షాకై కేకలు పెట్టింది.. చుట్టు పక్కల ఎవరూ లేకపోవడంతో తన కూతురిని రక్షించేందుకు పరుగుపెట్టింది.. ఆ తల్లి పోరాటం ముందు ఓడిపోయిన హైనా బిడ్డను వదిలేసి పారిపోయింది.

రాజస్థాన్‌లోని కోటకు సమీపంలోని ఇటావాకు చెందిన తుల్సా బాయి 6 నెలల కుమార్తె బిస్రతతో కలిసి గేదెలను మేపేందుకు అడవికి వెళ్లింది. కూతురిని ఒక చెట్టు దగ్గర ఉంచిన తుల్సా గేదెల దగ్గరకు వెళ్లింది. అంతలో ఆ చిన్నారి దగ్గరకు ఓ హైనా వచ్చింది. ఆ బిడ్డను నోట కరుచుకుని పరిగెత్తింది. బిడ్డ ఏడుపు విన్న తుల్సా హైనాను చూసి షాకైంది. తన బిడ్డను రక్షించుకునేందుకు హైనా వెంట పరిగెత్తింది. పెద్ద కర్ర తీసుకుని కేకలు పెడుతూ వెంటబడింది.

కొద్ది దూరం వెళ్లాక హైనా వెనుక కాళ్లను పట్టుకుని కొట్టింది. దీంతో హైనా ఆ బిడ్డను వదిలేసి తుల్సాను కరిచేసింది. అయినా తుల్సా హైనాను వదల్లేదు. కొద్ది పోరాటం తర్వాత హైనా అక్కడి నుంచి పారిపోయింది. ఈ దాడిలో ఆరు నెలల బిస్రతకు గాయాలయ్యాయి. బిడ్డను తీసుకుని తుల్సా వెంటనే హాస్పిటల్‌కు వెళ్లింది. అక్కడ బిస్రతకు వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి కట్టు కట్టారు.

Updated Date - 2022-11-09T18:37:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising