గిటార్ మీద జాతీయగీతం.. మైమరపిస్తున్న మ్యూజిక్ ఫెస్టివల్..
ABN, First Publish Date - 2022-12-04T12:09:17+05:30
భారతదేశంలో జరిగే అతిపెద్ద సంగీత వేడుక ..
జాతీయపతాకానికి జాతీయగీతానికి ఎంతప్రాముఖ్యత ఇస్తామో తెలిసిందే.. స్కూల్ లో ప్రార్థనలో భాగంగా ఆలపించడం నుండి రాష్ట్ర, దేశ స్థాయిలో జరిగే వివిధ కార్యక్రమాల వరకు జాతీయగీతం లేకుండా ఏది మొదలుకాదు. ప్రస్తుతం నాగాలాండ్ లో హార్న్ బిల్ ఫెస్టివల్ జరుగుతోంది. భారతదేశంలో జరిగే అతిపెద్ద సంగీత వేడుక అయిన ఈ హార్న్ బిల్ ఫెస్టివల్ కు విదేశీలు సైతం హాజరవుతారు. మరీ ముఖ్యంగా ఇక్కడ అడవులలో నివసించే ప్రత్యేక తెగ ప్రజల నృత్యాలు, వారి సంప్రదాయాలు ఈ ఫెస్టివల్ కు హాజరయ్యేవారిని ఎంతగానో ఆకట్టుకుంటాయి. అయితే ఎన్ని వంటలు తిన్నా దేవుడి ప్రసాదం రుచికి సాటిరావన్నట్టు ఈ మ్యూజిక్ ఫెస్టివల్ లో భారతదేశ జాతీయగీతం సెంటరాఫ్ అట్రాక్షన్ అయ్యింది.
ఓ గిటార్ కళాకారిణి తన గిటార్ మీద జనగణమన ను వాయించగా అందరిలో దేశభక్తి ఉప్పొంగింది. అందరూ జాతీయగీతానికి స్టాండింగ్ ఇచ్చి గౌరవించారు. ఈ ఫెస్టివల్ డిసెంబర్ 1న మొదలై 10వ తేదీ వరకు సాగుతుంది. హార్న్ బిల్ అనే పక్షి ఈ తెగ వారికి ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రస్తుతం సంగీత ప్రవాహంలో ఒలలాడుతున్న నాగాలాండ్ ప్రాంతం జాతీయగీతపు సంగీతంతో మరింత మైమరిపిస్తోంది.
Updated Date - 2022-12-04T12:09:19+05:30 IST