ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ రెస్టారంట్ కు ఒక్కసారైనా వెళ్లాలంటున్న నెటిజన్లు.. దీని ప్రత్యేక ఇదీ!

ABN, First Publish Date - 2022-10-30T14:31:15+05:30

ఓ రెస్టారెంట్ వినూత్నప్రయోగం.........

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాధారణంగా హోటల్‌లో లేదా రెస్టారెంట్ లో ఫుడ్ తెచ్చిపెట్టేవాళ్ళు సరిగ్గా వినిపించుకోకపోతే చెప్పలేనంత కోపం వస్తుంది. కస్టమర్‌లు ఏదైనా అసౌకర్యానికి గురైతే రెస్టారెంట్ యజమానూలు కూడా సిబ్బందిపై అంతే కోప్పడతారు, తిడతారు. ఒక దశలో కొందరిని పని నుండి తొలగిస్తారు కూడా. కానీ ఓ రెస్టారెంట్ మాత్రం వినూత్నప్రయోగం చేసింది. వినికిడి లోపం, మూగతనం ఉన్నవారిని సిబ్బందిగా నియమించుకుంది. అక్కడ కస్టమర్లకు, సిబ్బందికి మధ్య కమ్యూనికేషన్ సమస్య ఉండకూదని మెనూ కార్డ్స్‌లో ప్రతి ఐటమ్ దగ్గర సైగ భాషను పొందుపర్చింది. దీంతో లోపమున్నవారైనప్పటికీ ఎంచక్కా ఆ రెస్టారెంట్‌ను చక్కగా నడిపిస్తున్నారు.

అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌కు చేరింది. ఆ వీడియోలో ఒక మహిళ రెస్టారెంట్ కు వెళ్ళి అక్కడి సిబ్బందితో తనకు కావలసిన ఫుడ్ కావాలని అడుగుతుంది. అది కూడా మెనూ కార్డ్‌లో ఐటమ్ పక్కన ఉన్న సైగల భాష ఆధారంగా సదరు మహిళ.. ఆమె తనకు కావలసిన ఫుడ్ ఆర్డర్ చేయగా.. అక్కడ పనిచేసే మూగ, వినికిడి లోపం కలిగిన అమ్మాయి ఆమె అడిగిన ఆహార పదార్థాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే ఒక అబ్బాయి కూడా ఇదే విధంగా కస్టమర్‌ను ఆహ్వానించడం.. వచ్చిన ఆ కస్టమర్ సైగల భాషలో ఫుడ్ ఆర్డర్ చేయడం.. సదరు అబ్బాయి ఫుడ్ తెచ్చిపెట్టడం వీడియోలో కనిపిస్తుంది. లోపమున్నవారు అయినా కస్టమర్‌లను నవ్వుతూ ఆహ్వానించే తీరు, ఫుడ్ తెచ్చిపెట్టడం, కస్టమర్‌‌ల రివ్యూలను కోరడం వంటి దృశ్యాలు కూడా వీడియోలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను కూడా ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఒక్కసారి అయినా ఆ రెస్టారెంట్ కు వెళ్ళాలని ఉందని ఆసక్తి చూపుతూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు హోటల్ యజమాన్యాన్ని, చక్కగా పని చేస్తున్న సిబ్బందిని ప్రశంసిస్తున్నారు. కొసమెరుపు ఏమిటంటే ఈ రెస్టారెంట్.. హాస్పిటాలిటి కౌన్సిల్ లండన్ అవార్డ్‌ను కూడా గెలుగుచుకుంది.

Updated Date - 2022-10-30T15:03:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising